అది మా అమ్మ చివరి కోరిక: నాగవైష్ణవి అన్న

14 Jun, 2018 16:54 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఎనిమిది సంవత్సరాల క్రితం 2010లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తీర్పు వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం విజయవాడ మహిళా సెషన్స్‌ జడ్జి ఈ కేసులో ముగ్గురు నిందితులకు జీవితఖైదు ఖరారు చేస్తూ తుది తీర్పు ఇచ్చారు. 79 మందిని విచారించిన న్యాయస్థానం, వెంటకరావు గౌడ్‌ను ప్రధాన దోషిగా నిర్ధారిస్తూ తీర్పువెలువరించింది. 

కోర్టు తీర్పుపై నాగవైష్ణవి సోదరుడు హరీష్‌ స్పందించారు. నాగవైష్ణవి కేసులో జడ్జిమెంట్‌ కరెక్ట్‌గా వచ్చిందని భావిస్తున్నానని అన్నారు. తాను ఎప్పుడు లైఫ్‌ అండ్‌ టిల్‌ డెత్‌ అనే తీర్పు వినలేదని చెప్పాడు. తీర్పు లేటుగా వచ్చిందని, రెండేళ్ళ క్రితం తీర్పు వచ్చి ఉంటే ఈ కేసు కోసం పోరాడిన తన తల్లి, బాబాయ్‌తో పాటు ఎంతో మంది సంతోషించేవారని పేర్కొన్నారు. ఇక మీదట మరొకరు ఇలాంటి  దారుణాలకు పాల్పడకుండా తీర్పు వచ్చిందన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని మా అమ్మ కోరుకునేదని హరీష్‌ కన్నీరు మున్నీరయ్యారు. 

నాగవైష్ణవి హత్య కేసులో వెలువడిన తీర్పు

మరిన్ని వార్తలు