వివాహిత ఊహాశ్రీ అదృశ్యంపై పలు అనుమానాలు

1 Aug, 2019 07:55 IST|Sakshi

సాక్షి, బొమ్మలసత్రం(కర్నూలు) : నంద్యాల ఎస్‌బీఐ కాలనీకి చెందిన వివాహిత ఊహాశ్రీ హైదరాబాద్‌లో కనిపించకపోవటంతో తల్లిదండ్రుల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. భర్త బంధువుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదైనప్పటికీ నేటికీ ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఎవరైనా కొత్త వ్యక్తులు తన కుమార్తెను కిడ్నాప్‌ చేసి ఉండవచ్చని తండ్రి నాగరాజు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

నాగరాజు తెలిపిన వివరాల మేరకు ఎస్‌బీఐ కాలనీకి చెందిన నాగరాజు, అరుణ దంపతుల కుమార్తె ఊహాశ్రీని హైదారాబాద్‌లోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన నాగరాజు, శాంతమ్మ దంపతుల కుమారుడు మురళితో రెండేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లయిన కొద్ది రోజులకే మురళి ఉద్యోగరీత్యా ఖడ్తర్‌కు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఊహాశ్రీ అత్తమామల వద్దే ఉంటుండగా ఆరోగ్యం సరిగా లేక అత్త కొంత కాలం క్రితం చికిత్స నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది.

మామ నాగరాజుతో కలిసి ఊహశ్రీ ఇంట్లోనే ఉంటోంది. గత నెల జూలై 5న మామ నాగరాజు ఉద్యోగరీత్య విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రాగా ఊహాశ్రీ కనిపించలేదు. సమీప బంధువులను విచారించినా ప్రయోజనం లేకపోవడంతో జీడిమెట్ల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఊహాశ్రీ కోసం తెలంగాణ పోలీసులు ఎంత గాలించినా ఫలింతం లేకపోవటంతో సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. గత నెల 9న ఒంగోలులో ఓ వ్యక్తితో ఊహాశ్రీ కనిపించినట్లు తల్లిందండ్రులు, పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులతో కలిసి తల్లిదండ్రులు ఒంగోలు, చుట్టు పక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. ఇప్పటి వరకు తమ కుమార్తె జాడ తెలియకపోవటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రణయ్‌ కేసులో నిందితుడిని గుజరాత్‌కు..

సుల్తాన్‌పూర్‌లో దొంగల బీభత్సం 

అంతు చిక్కని ఆయుధ రహస్యం!

మద్యానికి బానిసై చోరీల బాట

ఉసురు తీసిన ‘హైటెన్షన్‌’

పుట్టిన రోజు షాపింగ్‌కు వెళ్లి..

అదనపు కట్నం.. మహిళ బలవన్మరణం

దారుణం : స్నేహితులతో కలిసి సోదరిపై..

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..

మూడేళ్ల చిన్నారి తల, మొండెం వేరు చేసి..

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తన

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

రూ.25.86 లక్షల జరిమానా

సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయంపై.. ఏసీబీ దాడి

ఉరికి వేలాడిన నవ వధువు..

వివాహేతర సంబంధంతో మహిళ హత్య

క్యూనెట్‌ బాధితుడు అరవింద్‌ ఆత్మహత్య

ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!

భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని..

రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు

గుండాల ఎన్‌కౌంటర్‌.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని..

హైదరాబాద్ జీడిమెట్లలో మరో కిడ్నాప్ కలకలం..! 

తండ్రి పోలీసు.. కొడుకు హంతకుడు

క్రికెట్‌లో గొడవ.. కత్తెరతో పొడిచి హత్య

తలాక్‌ చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

ఆశ పడింది.. అడ్డంగా దొరికింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..