శ్రీధరణి హత్యకేసులో పురోగతి ఏదీ

28 Feb, 2019 13:06 IST|Sakshi
శ్రీధరణి తల్లిదండ్రులను ఓదారుస్తున్న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి  

మహిళలపై అఘాయిత్యాలను ఉపేక్షించం

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి

ఏలూరు టౌన్‌ : శ్రీధరణి హత్య కేసులో పోలీసు అధికారుల పురోగతి కనిపించటంలేదని, కేసు దర్యాప్తులో అలసత్వం వహిస్తే పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ఇటీవల హత్యకు గురైన శ్రీధరణి కేసుకు సంబంధించి బుధవారం రాజకుమారి భీమడోలు మండలం ఎంఎం పురం గ్రామంలోని  శ్రీధరణి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంత రం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఘటనలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న నవీన్‌కుమార్‌ను ఆమె పరామర్శించారు. తలకు తీవ్రగాయాలెన నవీన్‌ నుంచి వైద్యుల సమక్షంలో వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకేమీ గుర్తురావటంలేదని, పోలీసులకు ముం దు నుంచి చెప్పే సమాధానమే రాజకుమారికీ అతడు చెప్పాడు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
 
నవీన్‌ కూడా నేరస్తుడే
అనంతరం మహిళా కమిషన్‌ చైర్మన్‌ రాజకుమారి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు నవీన్‌కుమార్‌పైనా అనుమానాలు ఉన్నాయని, ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడని అనుకుంటున్నట్టు తెలిపారు. శ్రీధరణిని అక్కడకు తీసుకువెళ్లాడు కాబట్టి నవీన్‌ కూడా నేరస్తుడే అవుతాడన్నారు. ఘటన జరిగి నాలుగురోజులు కావస్తున్నా నేరస్తులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు.

ఆడపిల్లలు కూడా తమ హద్దుల్లో ఉండాలని, గుడ్డిగా ప్రేమపేరుతో నమ్మి మోసపోవద్దని హితవుపలికారు. పర్యాటక కేంద్రమైన బౌద్ధారామాల వద్ద భద్రత, రక్షణ లేకపోవటం దారుణమన్నారు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వాసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్, న్యూరోసర్జన్‌ డాక్టర్‌ వి జయప్రసాద్, ఐసీడీఎస్‌ జేడీ విజయకుమారి, మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజ్యలక్ష్మి, ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఉన్నారు.

శ్రీధరణి కుటుంబాన్ని ఆదుకుంటాం
భీమడోలు: తెర్లి శ్రీధరణి అనే యువతి దారుణ హత్యకు గురికాగా ఆమె కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. పూళ్ల పంచాయతీ శివారు ఎంఎం పురంలో శ్రీధరణి కుటుంబాన్ని బుధవారం ఆమె పరామర్శించారు. ఈసందర్భంగా శ్రీధరణి తల్లిదండ్రులు అప్పారావు, అలివేలు మంగ చైర్‌పర్సన్‌ రాజకుమారి కాళ్లపై çపడి తమకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరుగా విలపించారు.

తన కుటుంబానికి వచ్చిన కష్టం మరో ఆడబిడ్డ కుటుంబానికి రాకూడదంటూ బోరుమన్నారు. గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బా«ధిత కు టుంబాన్ని చైర్‌పర్సన్‌ రాజకుమారి ఓదార్చారు.  ప్రభుత్వ పరంగా పక్కా ఇల్లు అందిస్తామని, ఆర్థిక సాయం చేస్తామన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకూ పె చ్చుమీరుతున్న అఘాయిత్యాలను తీవ్రంగా ఖండించారు.

తెనాలి, తాడేపల్లిలో ఘటనలు, ఏలూరులో తాజా ఘటన బా«ధిస్తున్నాయన్నారు. ఇలాంటి ఘటనలను కమిషన్‌ సహించేది లేదన్నారు. దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించమని హెచ్చరించారు. దోషులను 24 గంటల్లో అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించారు. బెయిల్‌ రాకుండా చూడాలన్నారు. నిందితుడికి నెల రోజుల్లో శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

కళాశాలలు, వసతి గృహల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను ఆదేశిం చామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మరింత ని ఘా పెంచుతామన్నారు. రాష్ట్ర కమిషన్‌ సభ్యురా లు రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్‌ పీడీ కె.విజయకుమారి, కమిషన్‌ అధికారులు సూయజ్, డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐ ఎస్‌సీహెచ్‌ కొండలరావు, ఎస్సై ఐ.వీర్రాజు,  పీఓ ఏలూరు తులసి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు