పక్కా స్కెచ్‌.. 10 కోట్ల డ్రగ్స్‌ కొట్టేశారు..!

18 May, 2019 11:45 IST|Sakshi

సాక్షి, తిరుపతి : రేణిగుంటలోని ఓ డ్రగ్స్‌ ఫ్యాక్టరీలో గత నెలలో చోరీకి గురైన రూ.10 కోట్ల విలువైన అల్ఫాజోన్‌ దోపిడీ కేసులో నిందితులు పట్టుబడ్డారు. ప్యాక్టరీలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులతో కలిసి ఓ మాజీ ఉద్యోగి ఈ చోరీలో నిందితులుగా ఉన్నారని తెలిసింది. వివరాలు.. రేణిగుంటలోని ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఉన్న మల్లాడి ఫ్యాక్టరీలో పనిచేసి సస్పెండైన దక్షిణా మూర్తి అనే మాజీ ఉద్యోగి అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చిట్టిబాబు అనే వక్తితో కలిసి డ్రగ్స్‌ కొట్టేయడానికి పథకం పన్నారు. ఆల్ఫాజోన్ అనే అతి ఖరీదైన మత్తుమందును కాజేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఫ్యాక్టరీలోని స్టోర్‌లో పనిచేస్తున్న నాగరాజు, శ్రీనివాసులు అనే వ్యక్తులకు రూ.10 లక్షలు ఆశ చూపి వారి ద్వారా గత నెలలో 30  కేజీల ఆల్ఫాజోన్ కాజేశారు. తర్వాత బెంగుళూరులో ఓ వ్యక్తికి 15 కేజీలను అమ్మేసి మిగిలిన దానిని దక్షిణామూర్తి తన ఇంట్లో  దాచిపెట్టాడు. 

అదేక్రమంలో బెంగుళూరులోని నార్కోటిక్ అధికారులు ఒక డ్రగ్స్ కేసులో ముద్దాయిని అరెస్టు చేయగా అతని వద్ద భారీగా మత్తుమందు దొరికింది. విచారణలో రేణిగుంటలోని మల్లాడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారి వద్ద దానిని కొనుగోలు చేసానని చెప్పాడు. పేర్లు వెల్లడించారు. నార్కోటిక్ అధికారులు బుధవారం సాయంత్రం ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని చిట్టిబాబు, నాగరాజు, శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పేసుకున్నారు. అనంతరం దక్షిణామూర్తిని పట్టుకుని అతని ఇంట్లో దాచిపెట్టిన 15  కేజీల మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితులను హైదరాబాద్‌ కార్యాలయానికి తరలించారు. నిందితుల వివరాలు... చిట్టిబాబు - అడుసుపాళ్యం, శ్రీనివాసులు - గాజులమండ్యం, నాగరాజు - కే ఎల్ ఏం హాస్పిటల్, దక్షిణా మూర్తి - కే ఎల్ ఏం హాస్పిటల్.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమెరికాలో దారుణం

డబ్బుల కోసం డ్రైవర్‌ దారుణం

ఎలుకల మందు పరీక్షించబోయి..

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ విదేశీ యువతి

‘నన్ను కూడా చంపండి’

పోకిరీల వేధింపులు.. బాలిక ఆత్మహత్య 

నకిలీ పోలీసు అరెస్టు..!

ఫాదర్స్‌ డే రోజే వెలుగుచూసిన దారుణం

పార్టీ  పేరిట పిలిచి.. స్పానిష్‌ యువతిపై..

లిస్బన్‌ క్లబ్‌ ఘటన.. డీజీపీ ఆరా

తోటల్లో వ్యభిచారం.. అధికులు కాలేజీ స్టూడెంట్సే

గర్భిణి అని కూడా చూడకుండా..

నవదంపతుల ఆత్మహత్య

ఒక్క ఫోన్‌ కాల్‌ విలువ రూ.40,000!

పోలీసుల ముందే బీరు తాగుతూ హల్‌చల్‌..

గంజాయి చాక్లెట్‌ 

తెల్లారిన బతుకులు

బెంబేలెత్తిన బీహార్‌.. ఒక్కరోజులో 40 మంది మృతి

ప్రియుడి మోజులో పడి.. దారుణానికి  ఒడిగట్టి..

నకిలీ ఎస్సై హల్‌చల్‌

ఓ విదేశీ జంట.. కరెన్సీ కావాలంటూ!

సిండి‘కేటు’కు సంకెళ్లు 

బీజేపీ అధ్యక్షురాలి సెల్‌ఫోన్‌ చోరీ

నకిలీ విత్తనంపై నిఘా

ఈజీ మైండ్‌ ఇట్టే ముంచేసింది..

పేరుకే పోలీస్‌..వృత్తి మాత్రం దొంగతనం

అయ్యో.. హారికా..!

చెల్లెల్ని ప్రేమించాడు.. వావివరసలు మరిచి..

అదే బావిలో అప్పుడు కొడుకు .. ఇపుడు తండ్రి..

రౌడీ షీటర్‌ దారుణహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిన్నారితో ప్రియాంక చోప్రా స్టెప్పులు

‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

గాయాలపాలైన మరో యంగ్ హీరో

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!