భవనం పైనుంచి పడి.. ఎన్‌సీసీ అధికారి దుర్మరణం

29 May, 2019 13:13 IST|Sakshi
మృతుడు నర్సింహులు

దుప్పలవలస గురుకుల పాఠశాలలో సంఘటన

మృతునిది విజయనగరం జిల్లా

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల మండలంలోని దుప్పలవలస బాలయోగి గురుకుల పాఠశాల ఎన్‌సీసీ శిబిరంలో మంగళవారం విషాదం నెలకొంది. వారం రోజుల నుంచి ఉత్తరాంధ్ర స్థాయి ఎన్‌సీపీ ప్రత్యేక శిబిరం ఈ పాఠశాలలో కొనసాగుతోంది. టొంపల నర్సింహులు (35) గరివిడి పట్టణం శ్రీరాంనగర్‌లో ఎస్‌వీఎస్‌ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్రం అధ్యాపకునిగా పని చేస్తున్నారు. ఎన్‌సీసీ అధికారిగా సైతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్కడి ఎన్‌సీసీ విద్యార్థులకు క్యాంప్‌ అధికారిగా దుప్పలవలస తీసుకువచ్చారు.

రెసిడెన్సియల్‌ క్యాంపు కావటంతో ఇక్కడే ఉండి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బస చేసిన గది నుంచి రెండో అంతస్థుకు మంగళవారం వేకువ జామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లారు. నిద్ర మత్తులో పిట్టగొడ పైనుంచి పైడిపోయారు. తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న ఆయను స్థానిక అధికారులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రికి తరలించే సరికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతునిది విజయన గరం జిల్లా తెర్లాం మండలంలోని హర్షబలగ గ్రామం. ఎచ్చెర్ల ఎస్‌ఐ వై.కృష్ణ కేసున మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని సమాచారం కుటుంబ సభ్యులకు  తెలియజేశారు. రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

>
మరిన్ని వార్తలు