ఠాణా.. త‘లుక్‌’

14 May, 2018 09:57 IST|Sakshi
పచ్చని వాతావరణంలో సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌

ఆధునిక హంగులతో నూతన భవనాలు

జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న భవన నిర్మాణాలు

సేదతీరేందుకు విశ్రాంతి, యోగ, జిమ్‌ సదుపాయాలు

సంగారెడ్డి క్రైం : నిత్యం సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో నిమగ్నమయ్యే పోలీస్‌ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మొదటగా అత్యాధునిక వాహనాలను ఏర్పాటు చేయగా నిత్యం పనిచేసే కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటిని ఆధునీకరించడంతో పాటు నూతన సాంకేతిక ఒరవడితో అన్ని హంగులతో కూడిన భవనాల నిర్మాణానికి  హోంశాఖ శ్రీకారం చుట్టింది.

అందులో భాగంగానే  కేవలం పోలీస్‌ స్టేషన్‌లే కాకుండా పోలీసు సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్లు, కొత్త జిల్లాలు ఏర్పడటంతో నూతన కార్యాలయ భవనాలు, పోలీస్‌స్టేషన్‌ల నిర్మాణాలను పెద్దఎత్తున చేపడుతుంది. ఈ విషయంపై పూర్తి కథనం.

భవన నిర్మాణాలతో కొత్త కళ...

నూతనంగా నిర్మించే పోలీస్‌ స్టేషన్‌లు, కమిషనరేట్‌ కార్యాలయాల్లో అత్యాధునికమైన అన్ని హంగులతో భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే ప్రజల సౌకర్యం కోసం రిసెప్షన్‌ సెంటర్, సీసీ టీవీ ఫుటేజీలను చూడటానికి ఎల్‌ఈడీల ఏర్పాటుతో పాటు అధికారుల సమావేశాల సముదాయాలను సమకూర్చుతున్నారు. నూతన పోలీస్‌ భవనాన్ని చూడగానే ప్రజలను ఆకర్షించేలా నిర్మిస్తున్నారు. భవనం చుట్టు పక్కల పచ్చని మొక్కల పెంపకం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు.

సిద్దిపేటలో మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ 

రాష్ట్రంలోని సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను మోడల్‌ పోలీస్‌స్టేషన్‌గా ఏర్పాటు చేశారు. ని రంతరం విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది ఆరోగ్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొర వ చూపుతోంది. రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండే విధంగా అన్ని హంగులతో నిర్మాణం చేపడుతున్నారు. సిబ్బందికి రెస్ట్‌ రూమ్‌తో పాటు యోగా చేయడానికి ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేస్తున్నారు.

జిమ్, హెల్ప్‌ డెస్క్, అత్యాధునికంగా రిసెప్షనిస్ట్‌æతో పాటు ఫర్నీచర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా పొన్నాల గ్రామశివారులో నూతనంగా నిర్మించిన ఆధునాతన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఈ మధ్యనే మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. 

రిసెప్షన్‌ సెంటర్‌ ఏర్పాటు..

తమ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌ వచ్చే ప్రజలు ఏ అధికారిని కలవాలో కూడా తెలియదు. అలాం టి వారికి సహాయంగా రిసెప్షనిస్ట్‌లను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సమస్యపై వచ్చి న బాధితులను మర్యాద పుర్వకంగా స్వాగతిం చి వారికి ఉన్న సమస్యను తెలుసుకొని సంబం«ధిత అధికారి వద్దకు తీసుకెళ్తారు. ఈ మధ్యకాలంలో ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది.

నూతనంగా నిర్మించిన భవనాలు

సంగారెడ్డి జిల్లాలో జోగిపేట పోలీస్‌స్టేషన్‌కు రూ.50 లక్షలు, జహీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ రూ. 50 లక్షలు, సంగారెడ్డి ట్రాఫిక్‌పోలీస్‌ స్టేషన్‌ (ని ర్మాణ దశలో ఉంది) రూ.కోటి, నారాయణఖేడ్‌ పోలీస్‌స్టేషన్‌ (నిర్మాణదశలో ఉంది) రూ.కోటి

సిద్దిపేట జిల్లాలో ..

æ దుద్దెడ గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన కమిషనర్‌ కార్యాలయం రూ.15 కోట్లు
æ కోహెడ నూతన పోలీస్‌స్టేషన్‌కు రూ.98 లక్షలు
æ దుబ్బాక సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌ రూ.30లక్షలు
æ గజ్వేల్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ రూ.30 లక్షలు
æ సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ రూ.50 లక్షలు
æ    అలాగే కొమురవెల్లి, మర్కూక్, అక్కన్నపేట, రాయపోల్‌ మండలాలలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నవి.

ఘటన స్థలానికి త్వరగా చేరుకుంటున్నాం..

రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునికమైన వాహనాలను ఇవ్వడంతో అనుకున్న సమయంలోనే ఘటనా స్థలానికి చేరుకుంటున్నాం. అదేవిధంగా నూతనంగా నిర్మించిన భవనాల్లో అత్యధునికంగా ఉండటంతో సిబ్బంది సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి మౌలిక సదుపాయాలు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం బెటర్‌ పోలీస్‌ విధానాన్ని అమలు చేయడానికి ప్రత్యేక చొరవ చూపుతుంది.  - జోయల్‌ డేవిస్, సీపీ, సిద్దిపేట  
 

మరిన్ని వార్తలు