వ్యక్తి సజీవ దహనం కేసులో కొత్త కోణం

5 Dec, 2019 19:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వనస్థలిపురంలో ఓ వ్యక్తి సజీవ దహనం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. గత నెల 26న వనస్థలిపురంలో గుడిసెకు నిప్పంటుకుని రమేష్‌ అనే యువకుడు మృతి చెందాడు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు భావించారు. కానీ విచారణలో మరో కోణం బయటపడింది. అతని భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట జిల్లా కుమ్మరిగడ్డకు చెందిన కన్నెబోయిన రమేశ్‌ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. మేస్త్రీ పని చేసుకుంటూ.. బీఎన్‌రెడ్డి నగర్‌లోని ఎస్‌కేడి నగర్‌లోని ఖాళీ స్థలంలో గుడిసె వేసుకొని భార్య స్పప్నతో కలిసి నివాసముంటున్నాడు.

కాగా, స్పప్న.. వెంకటయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించి అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నింది. వ్యవసాయ పనుల కోసమని చెప్పి స్వగ్రామం వెళ్లిన స్వప్న.. సెప్టెంబర్‌ 26న ప్రియుడు వెంకటయ్యతో కలిసి నగరానికి వచ్చింది.  అదే రోజు రాత్రి.. వనస్థలిపురంలోని గుడిసెపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యారు. ఈ ఘటనలో గుడిసెలో నిద్రిస్తున్న రమేశ్‌ సజీవ దహనమయ్యాడు. గుర్తుతెలియన వ్యక్తి సజీవదహనం అయ్యాడని  సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. స్పప్న, అతని ప్రియుడు వెంకటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

భర్తతో కలిసి టిక్‌టాక్‌ చేసి..
హత్యకు ముందు స్వప్న తన భర్తతో కలిసి చేసిన టిక్‌టాక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అల.. వైకుంఠపురములోని‘ రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో... ’  అనే పాటకు సంతోషంగా స్టెప్పులేశారు. అంతలోనే తాను ఎంతో ప్రేమించే భార్యే తన ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయాడు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా