యువకుడి వేధింపులతో నవ వధువు ఆత్మహత్య

23 Dec, 2019 07:24 IST|Sakshi
మృతిచెందిన ఫామీద

పెళ్లయిన రెండు నెలలకే ఉరేసుకున్న వైనం

రెండు కుటుంబాల్లో విషాదం

చిత్తూరు, మదనపల్లె టౌన్‌: ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నన్ను తప్ప ఎవర్ని పెళ్లి చేసుకున్నా బతక నివ్వను’ అని ఒక యువకుడు బెదిరింపులకు దిగాడు. పెళ్లి అయి అత్తగారింటికి వెళ్లిన ఆమెను వదలలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె ఇంటి పైకప్పుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన మదనపల్లెలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ, ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పఠాన్‌ రాయాజ్‌ ఖాన్‌ కుమార్తె పఠాన్‌ ఫామీద (19)ను అదే కాలనీకి చెందిన బావాజాన్‌కు ఇచ్చి రెండు నెలల క్రితం పెళ్లిచేశారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో మదనపల్లె పట్టణం సైదాపేటకు చెందిన ఓ యువకుడు చిచ్చు రేపాడు.

ప్రేమిస్తున్నానని ఫామీద వెంట పడ్డాడు. ఆ యువతి అత్తగారి ఇంటికే నేరుగా వెళ్లి రోజు వేధింపులకు దిగాడు. ఈ విషయం పెద్దలకు తెలిసింది. దీంతో వారికి ఏమి చెప్పాలో దిక్కుతోచని ఆమె ఆదివారం రాత్రి తన ఉంటున్న గదిలోని పైకప్పుకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫామీద మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది. ఎస్‌ఐ హరిహరప్రసాద్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా : ఇంట్లోకి రానివ్వకపోవడంతో

జర్మనీలో మంత్రి ఆత్మహత్య 

మత్తు లేని జీవితం వ్యర్థమని..

దారుణ హత్య: సీరియల్‌ సన్నివేశాలే స్ఫూర్తి

కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య

సినిమా

కరోనా విరాళం

అంతా బాగానే ఉంది

నేను బాగానే ఉన్నాను

నిర్మాత ప్రసాద్‌ కన్నుమూత

అర్జున్‌.. అను వచ్చేశారు

ప్రపంచంలో ఎన్నో కష్టాలున్నాయి