కీచక భర్త: నవవధువుపై సామూహిక అత్యాచారం

29 Sep, 2018 12:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకాల కారణంగా ఓ నవవధువు సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన కురుక్షేత్రలోని బాబైన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు.. రెండు వారాల క్రితం ( సెప్టెంబర్‌ 12) మఖేష్‌, అమేధి (పేర్లు మార్చాం)లకు వివాహమైంది. అయితే, శోభనం రాత్రి గదిలోకి వెళ్లిన అమేధి(22)కి ఆమె భర్త పాలలో మత్తు మందు కలిపి తాగించాడు. అమేధి స్పృహ కోల్పోయిన తర్వాత ముఖేష్‌, అతని సోదరుడు, బావ, మరో నలుగురు తాంత్రికులు యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. రెండు రోజుల నరకయాతన అనంతరం యువతి అక్కడి నుంచి  బయటపడిందని పోలీసులు వెల్లడించారు.

బాధితురాలు తన తండ్రితో కలిసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి కురుక్షేత్ర మహిళా పోలీస్‌స్టేషన్‌కు కేసు బదిలీ అయిందనీ, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని స్టేషన్‌ ఆఫీసర్‌ శీలవతి తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆస్పత్రికి తరలించామని అన్నారు. కాగా, ఈ ఘటనలో పోలీసులు ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం గమనార్హం. కాగా, అత్తమామలు, ఆడపడుచు, తాంత్రిక పూజల కోసం వచ్చిన నలుగురు దుండగులు యవతిపై అఘాయిత్యం జరగడానికి ముఖ్య కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు