ఐసిస్‌ కలకలం

14 Jun, 2019 08:03 IST|Sakshi

దాడులకు వ్యూహరచన

సూత్రధారి వలలో తమిళ యువత

ఆలస్యంగా మేల్కొన్న తమిళ పోలీసులు

కోయంబత్తూరులో విచారణ ముమ్మరం

అజార్‌ వలలో ఎవరైన పడ్డారా? అని ఆరా

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఐసిస్‌ కలకలం బయలుదేరింది. తమిళ పోలీసుల కళ్లు గప్పి ఇక్కడ సాగుతున్న ఐసిస్‌ వ్యవహారాలను ఎన్‌ఐఏ పసిగట్టడం రాష్ట్ర భద్రతను ప్రశ్నార్థకం చేసింది. దాడులకు వ్యూహరచన జరిగినట్టు విచారణలో తేలడంతో ఆలస్యంగానైనా తమిళ పోలీసులు మేల్కొన్నారు. కోయంబత్తూరులో విచారణను ముమ్మరం చేశారు. అజారుద్దీన్‌ వలలో ఎవరైనా యువత పడ్డారా? అని ఆరా తీస్తున్నారు. రాష్ట్రం తీవ్రవాదుల హిట్‌ లిస్ట్‌లో ఉండటంతో పోలీసు యంత్రాంగం అప్రమతంగానే  వ్యవహరిస్తూ వస్తోంది.

అయితే, ఇక్కడ చాప కింద నీరులా సాగుతున్న వ్యవహారాలు పోలీసుల పని తీరు మీద విమర్శలు గుప్పించడమే కాదు, రాష్ట్ర భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గతంలో నిషేధిత సిమి తీవ్రవాద సంస్థకు అనుకూలంగా యువత ఏకం అవుతోండటాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించే వరకు ఇక్కడి పోలీసులు, ఇంటెలిజెన్స్‌ పసిగట్టలేని పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడి పోలీసులు హడావుడి సృష్టించినా, ఫలితం శూన్యం. ఇక, సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ పేలుడు కేసు విచారణ ఓ సవాలుగానే మారింది. అలాగే, హిందూ  నేతల హత్యకు వ్యూహ రచనలు సాగి ఉన్నట్టుగా వచ్చిన సంకేతాలు, సమాచారాలు ఉన్నా,  ఇక్కడ ఐఎస్‌ఐఎస్‌(ఐసిస్‌) కార్యకలాపాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నా భద్రతా పరంగా దూకుడు పెంచడంలో మాత్రం విఫలం అవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఎన్‌ఐఏ వర్గాలు ఇక్కడ దాడులు చేసే వరకు ఐసిస్‌ సానుభూతి పరుల గురించిన వివరాలు, వారి కార్యకలాపాలను రాష్ట్రపోలీసులు పసిగట్టలేని పరిస్థితి ఉండటం విమర్శలకు దారి తీస్తోంది.

దాడులే లక్ష్యంగా వ్యూహాలు
శ్రీలంకలో సాగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనతో సముద్ర తీరాల్లో గస్తీని ముమ్మరం చేసి రాష్ట్ర పోలీసులు చేతులు దులుపుకున్నారు. అయితే, రాష్ట్రంలో నక్కి ఉన్న ఆ దాడులకు మాడ్యూల్‌ సూత్రధారి గురించి సమాచార సేకరణలో విఫలం కావడం గమనార్హం. ఇది కూడా ఎన్‌ఐఏ బుధవారం రంగంలోకి దిగడంతోనే వెలుగులోకి వచ్చింది. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) వర్గాలు కోయంబత్తూరు నగరం అన్భునగర్‌లోని  అజారుద్దీన్, పోతనూరులోని సదాం, అక్బర్, అక్రమ్‌ తిల్లా, కునియ ముత్తురులోని అబూబక్కర్‌ సలీం, అల్లమిన్‌ కాలనీలోని ఇదయతుల్లా, కరీంషా ఇళ్లలో దాడులు సాగించిన విషయం తెలిసిందే. పొద్దు పోయే వరకు ఈ దాడులు సాగగా, అజారుద్దీన్‌ ఎన్‌ఐఏ టార్గెట్‌ అయ్యాడు. మిగిలిన ఐదుగుర్ని విచారణకు హాజరు కావాలని ఎన్‌ఐఏ వర్గాలు సమన్లు జారీ చేసి వెళ్లాయి. అయితే, అజారుద్దీన్‌ వద్ద జరిపిన విచారణ, లభించిన ఆధారాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఇతర సామగ్రి మేరకు ఐసిస్‌ మాడ్యూల్‌గా ఇక్కడ అతగాడు వ్యవహరిస్తుండం వెలుగులోకి వచ్చింది. శ్రీలంక బాంబు పేలుళ్లలో మరణించిన మానవ బాంబు జహ్రన్‌ హషీంకు ఫేస్‌బుక్‌ మిత్రుడిగా ఉండటమే కాదు, తమిళనాడులో ఐసిస్‌కు యువతను పంపించడం లక్ష్యంగా అజారుద్దీన్‌ ఇక్కడ తిష్ట వేసి ఉండటం గమనార్హం. అలాగే, తమిళనాడులో దాడులే లక్ష్యంగా వ్యూహ రచనలు సైతం సాగి ఉన్నట్టుగా సమాచారాలు వెలువడటం ఆందోళన కల్గిస్తోంది.

ఆలస్యంగా ఉరకలు
ఎన్‌ఐఏ వర్గాలు మహ్మద్‌ అజారుద్దీన్‌ను అరెస్టు చేసి తమ వెంట తీసుకెళ్లినానంతరం ఆలస్యంగా తమిళ పోలీసులు మేల్కొన్నారు. కోయంబత్తూరులో బుధవారం అర్థరాత్రి నుంచి హడావుడి పెంచారు. అజారుద్దీన్‌తో సన్నిహితంగా ఉన్నట్టు పేర్కొనబడుతున్న ఉక్కడం మహ్మద్‌ హసీం, కరుంబుకడై సయబుల్లా, అన్భునగర్‌ షాజహాన్‌ ఇళ్లల్లో సోదాల్లో నిమగ్నం అయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు ఈ సోదాలు సాగాయి. అజారుద్దీన్‌ ఇంటి పరిసరాల్లో ఉన్న వారి వద్ద, అతడితో సన్నిహితంగా ఉన్న మిత్రులు, వారికి సంబంధించిన వాళ్లను టార్గెట్‌ చేసి విచారణ పేరిట ఉరకలు తీశారు. అలాగే, అజారుద్దీన్‌ వలలో ఎవరైనా యువత పడ్డారా? అని ఆరా తీస్తున్నారు. కోయంబత్తూరులో గత కొంత కాలంగా హఠాత్తుగా కన్పించకుండా పోయిన యువత, వారికి సంబంధించిన వివరాల్ని సేకరించి, వీరు ఐసిస్‌లో చేరడానికి ఏమైనా దేశం దాటారా? అన్న అనుమానాలతో విచారణను ముమ్మరం చేసి ఉన్నారు. అలాగే, తీవ్రవాదుల హిట్‌ లిస్ట్‌లో ఉన్న చెన్నై, మదురై నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!