-

అమ్మాయి పేరుతో అలీని చీట్‌ చేశారు

22 Apr, 2019 19:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో అమ్మాయిల పేర్లు చెప్పి అగంతకులు మోసాలకు పాల్పడుతున్న జనాల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఓ నైజరీయన్‌ ప్రేమ పేరుతో అమ్మాయిలా నమ్మిస్తూ హైదరాబాద్‌కు చెందిన అలీ నుంచి రెండు లక్షల రూపాయలు రాబట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. అలీకి ఫెస్‌బుక్‌లో పరిచయం అయిన సదురు నైజీరియన్‌ తనను తాను అమ్మాయిగా పరిచయం చేసుకున్నాడు. తాను అమెరికాలో ఆర్మీ అధికారినిగా పనిచేస్తున్నానని చెప్పాడు. ప్రేమ పేరుతో నమ్మబలికాడు. తనకు డాలర్‌ బ్యాగ్‌ దొరికిందని.. ఆ డాలర్లను మార్చగా వచ్చిన డబ్బుతో హైదరాబాద్‌లో సెట్‌ అవుదామంటూ అలీని ప్రలోభ పెట్టారు. ఆ డాలర్‌ బ్యాగ్‌ ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఉందని దానికి సర్వీస్‌ ట్యాక్స్‌, జీఎస్టీ కట్టాలని అలీ వద్ద నుంచి రెండు లక్షల రూపాయలు తీసుకున్నాడు. తీరా ఎంతకీ డాలర్‌ బ్యాగ్‌ రాకపోవడంతో అలీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తాను రెండు లక్షల రూపాయలు మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్‌ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులో పూణేలో ఉంటున్న నైజీరియన్‌ నంబా రేమండ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు