నైజీరియన్ల అక్రమ దందాకు తెర

25 Jul, 2019 20:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజీవ్‌గాందీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో నైజీరియన్లు కొత్త రకం దందాతో రంగంలోకి దిగారు . ఎయిర్‌పోర్ట్‌ కార్గోలో లాగోస్ నుంచి పెద్ద మొత్తంలో అక్రమంగా నిషేధిత పదార్థాలు  దిగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో తని​ఖీలు నిర్వహించిన డీఆర్‌ఐ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీగా నిషేధిత పదార్థాలను పట్టుకున్నారు. నైజీరియా నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ భారీ పార్సల్‌లో 13 టన్నులు ఉన్న కాస్మోటిక్స్‌, బీర్‌, విస్కీ, జిన్‌తోపాటు ఆహార పదార్ధాలను సీజ్‌ చేశారు. వీటి విలువ 52 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా అనుమతి లేకుండా వీటిని నగరానికి తీసుకు వచ్చిన నిందితులపై అధికారులు విచారణ జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు