జిల్లాలో ఉగ్రవాదులు లేరు: సీపీ కార్తికేయ

27 Aug, 2019 11:13 IST|Sakshi

ప్రజలు వదంతులను నమ్మొద్దు 

సోషల్‌ మీడియాపై ప్రత్యేక దృష్టి:సీపీ కార్తికేయ 

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుండారం గ్రామంలో గాంధీ విగ్రహానికి కొంత మంది అ సాంఘిక శక్తులు గాంధీ ముఖానికి బొగ్గుతో రాసి కాగితాల దండ వేయడంపై పోలీసుశాఖ సీరియస్‌గా దర్యాప్తు జరుపుతోందని సీపీ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంలోని అసాంఘిక శక్తుల ఆట కట్టించి, కూకటి వేళ్లతో పెకిలిస్తామని సీపీ పేర్కొన్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఫొటోలు, వీడియోలు వస్తే ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, ఇతరు లు పోస్టుచేయవద్దని సూచించారు. సో షల్‌ మీడియాపై పూర్తి స్థాయి దృష్టి సారించామన్నారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దన్నారు. నిజామాబాలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం లేదన్నారు. ఈ విషయంలో నిజామాబాద్‌ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు