ఎన్‌ఆర్‌ఐ మహిళ అనుమానాస్పద మృతి

27 Apr, 2018 18:09 IST|Sakshi

ఫరిదాబాద్‌: హరియాణాలో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఫరిదాబాద్‌లోని తాజ్ వివాంట హోటల్‌లో బాత్‌ టబ్‌లో పడి  ఉన్న మహిళ మృతదేహన్ని ఆలస్యంగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లండన్‌లో స్థిరపడిన భారత సంతతి మహిళ రీతూ కుమార్‌ (40) ఈ నెల 22న భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఫరిదాబాద్‌లోని తాజ్‌ వివాంట హోటల్‌ బస చేస్తున్నారు. కాగా ఆమె కుటుంబ సభ్యులు గురువారం రీతూ కుమార్‌కు ఫోన్‌ చేయగా స్పందించలేదు. దీంతో వారు ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం హోటల్‌లోని వచ్చి ఆమె గదిలోకి వెళ్లి చూడగా బాత్‌రూంలో ఆమె మృతదేహం లభించింది. కాగా ఆమె గత కొద్ది రోజులుగా తన భర్తతో కలిసి ఉండడం లేదని, ఆమె గదికి కూడా హోటల్‌ సిబ్బందిని రావద్దని చెప్పినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు.

మరిన్ని వార్తలు