బ్యుటీషియన్ పద్మ కేసు: తెరపైకి నూతన్‌ భార్య

27 Aug, 2018 13:53 IST|Sakshi

సాక్షి, హనుమాన్ జంక్షన్ : బ్యూటీషియన్ పద్మపై దాడి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పద్మపై హత్యాయత్నం చేశాడని అనుమానిస్తున్న నూతన్‌ కుమార్ తాజాగా ఆత్మహత్య చేసుకోవడంతో.. ఈ కేసులో అసలు నిందితులు ఎవరు అన్నది మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో పద్మ ప్రియుడిగా భావిస్తున్న నూతన్ కుమార్ భార్య సునీతను పోలీసులు సోమవారం విచారించారు. తన భర్త చనిపోవడానికి బ్యూటీషియన్ పద్మనే కారణమని సునీత తెలిపింది.

2012లో తమ వివాహం జరిగిందని, తన భర్త నూతన్ ఓ ప్రైవేటు షోరూంలో మేనేజర్‌ గా పనిచేసేవారని తెలిపింది. ఆ సమయంలో అదే ఆఫీస్‌లో పనిచేస్తున్న పద్మ తన భర్తను లోబరుచుకుందని ఆమె ఆరోపించారు. తన భర్తకు ఇష్టం లేకున్నా వేధింపులకు గురిచేసిందని, విడాకులు తీసుకోవాల్సిందిగా నూతన్‌ను పద్మ హింసించిందని సునీత తెలిపింది. ప్రసుత దారుణమైన పరిస్థితులన్నింటికీ పద్మే కారణమని తెలిపింది. మరోవైపు బ్యూటీషియన్ పద్మ విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్న నూతన్ కుమార్ మృతదేహానికి ఇదే ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తమిళనాడు చేరుకున్న జవాన్ల మృతదేహాలు

ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకుని...

అతడి ఇంట్లో శవాన్ని చూసి పారిపోయారు

సిగరెట్‌ ఇస్తుండగానే లాక్కెళ్లారు

ప్రయోజకుడిని చేస్తే పట్టించుకోవడం లేదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పింక్‌ రీమేక్‌ మొదలైంది.!

పుల్వామా ఘటన.. విజయ్‌ ఆర్థిక సాయం

లొకేషన్ల వేటలో ‘ఆర్‌ఎక్స్‌ 100’..!

ఇన్నాళ్లకు విడుదలవుతోంది..!

దర్శకుడిగా మారనున్న కమెడియన్‌..!

‘కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది!’