ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..

28 May, 2020 15:00 IST|Sakshi
సన్‌సారి ఓజా, ఆలయ పూజారి

కటక్‌ : కాలం ఎంత అభివృద్ది చెందుతున్న కొంతమంది మనుషులు మాత్రం ఇంకా మూడ నమ్మకాలనే బలంగా నమ్ముతున్నారనడానికి ఈ వార్త ఉదాహరణగా చెప్పవచ్చు. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఈ యుగంలో ఇంకా ఇలాంటి మూడనమ్మకాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రాణత్యాగం చేస్తే కరోనా పారిపోతుందంటూ ఒక పూజారి నిండు మనిషి ప్రాణం తీసేశాడు. ఈ దారుణ ఘటన  బుధవారం రాత్రి ఒడిశాలోని కటక్‌లో చోటుచేసుకుంది.(నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు)

వివరాలు..  కటక్‌ జిల్లా బందాహుదా గ్రామానికి చెందిన సన్‌సారి ఓజా( 72) బందా మా బుద్ద బ్రాహ్మణి దేయి గుడిలో పూజారీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో  సరోజ్‌ కుమార్‌ ప్రధాన్(52)  పూజ చేసేందుకు ఆలయంలోకి వచ్చాడు. పూజ నిర్వహించిన అనంతరం ప్రధాన్‌ ఓజాను పలకరించాడు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి ప్రాణత్యాగం చేస్తే దేవుడు కరుణించి కరోనాను మాయం చేస్తానని దేవుడే స్వయంగా కలలో వచ్చి తనకు చెప్పాడంటూ సన్‌సాన్ ఓజా ప్రధాన్‌తో పేర్కొన్నాడు. టెక్నాలజీ ఇంత పెరుగుతున్న సమయంలో ఇంకా ఇలాంటి మూడ నమ్మకాలెందుకంటూ ప్రధాన్‌ తెలిపాడు. దీంతో ఇరువరి మధ్య మాటమాట పెరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఓజా తనకే దేవుడే స్వయంగా వచ్చి చెప్పాడంటూ అప్పటికే సిద్ధం చేసుకున్న గొడ్డలితో ప్రధాన్‌ తలపై బలంగా బాధడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు ఓజారు అదుపులోకి తీసుకొని ప్రధాన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రధాన్‌ను హత్య చేసేందుకు వాడిన గొడ్డలిని ఫోరెన్సిక్‌ రిపోర్టుకోసం సీజ్‌ చేసి ఓజాపై కేసు నమోదు చేశారు.(అద్దె చెల్లించలేదని దంపతుల్ని కాల్చిచంపాడు)

ఇదే విషయమై సెంట్రల్‌ రేంజ్‌ డీఐజీ ఆశిష్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ' ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తోన్న సన్‌సారి ఓజా మూడ నమ్మకాలను బలంగా నమ్మేవాడు. ఈ నేపథ్యంలోనే దేవుడే తనకు స్వయంగా చెప్పాడంటూ ప్రధాన్‌ను హత్య చేశాడు.  అయితే హత్య చేపే సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు మా ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం మృతదేహాన్ని మామిడిచెట్టు పైకి ఎక్కించి రాత్రంతా పక్కనే కూర్చున్నాడు. కొంతకాలంగా ఓజా మనసిక పరిస్థితి సరిగా లేదని, ఇంతకుముందు కూడా తనకు దేవుడు కనిపించేవాడంటూ చెప్పేవాడని స్థానికులు పేర్కొన్నారు. కాగా గురువారం ఉదయం మత్తు దిగాక ఓజా చెట్టు మీద నుంచి దిగి తానే ఈ హత్య చేసినట్లు ఓజా పోలీసులకు లొంగిపోయాడు. మనిషి ప్రాణం త్యాగం చేస్తే కరోనా పారిపోతుందనే ఉద్దేశంతోనే ప్రధాన్‌ను హత్య చేశాడంటూ' తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు