మదమెక్కిన తాతయ్య మృగాడిగా మారాడు..

8 Jul, 2020 12:55 IST|Sakshi

మనవరాలని ఆప్యాయంగా దగ్గరకు తీయాల్సిన వృద్ధుడు.. మదమెక్కిన మృగాడిగా మారాడు. తాతయ్యా అనే పిలుపుతో ఆనందాన్ని పొందాల్సిన వయసు.. పసిమొగ్గపై పైశాచికంగా ప్రవర్తించాడు. కమ్మని కథలు చెప్పి పిల్లల స్వచ్ఛమైన నవ్వుల్లో సంతోసాన్ని వెతుక్కోవాలిసిన మదిమిలో కామపిశాచి అయ్యాడు. తేలప్రోలు గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. 

ఉంగుటూరు(గన్నవరం): మండలంలోని తేలప్రోలు గ్రామానికి చెందిన బాలిక(5) తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన వృద్ధుడు చిన్నారులను ఆటలతో దగ్గర చేసుకున్నాడు. ఇంతలో వృద్ధుడి మృగాడు బయటి వచ్చాడు. ఆటలు ఆడిస్తున్నట్లు నటించాడు. దగ్గర ఉన్న ఇసుక గుట్ట వద్దకు తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు సమీపంలో ఉన్న కొందరు స్థానికులు చూశారు. ఇంతలో పాపకు ఏమి జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. లైంగిక దాడికి ప్రయత్నించినట్లు నిర్ధారించుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ వి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు