బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం

13 Sep, 2019 15:02 IST|Sakshi
అత్యాచారయత్నం చేసిన వృద్ధుడిని  అదుపులోకి తీసుకున్న స్థానికులు 

సాక్షి, ఆరిలోవ(విశాఖ తూర్పు) : ఐదేళ్ల బాలికపై అరవయ్యేళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేసిన ఘటన ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ వృద్ధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా కదిరి గ్రామానికి చెందిన తుమ్మగుంట అప్పలనాయుడు(60) సాగర్‌నగర్‌ సమీపంలోని భువనేశ్వరి కాలనీలో అతని కుమారుడి వద్ద రెండేళ్లుగా ఉంటున్నాడు. ఇద్దరూ తాపీ పనికి వెళ్తుంటారు. కాలు నొప్పిగా ఉండడంతో గురువారం అప్పలనాయుడు పనికి వెళ్లలేదు. ఇంట్లో మధ్యాహ్నం మద్యం సేవించాడు. అదే ప్రాంతానికి చెందిన వృద్ధురాలు తన ఐదేళ్ల మనవరాలిని ఎత్తుకొని కాలనీలో ఉన్న వినాయక పందిరి వద్దకు వచ్చింది. ఏదో పని మీద పక్కకు వెళ్లాలని తన మనవరాలిని అక్కడే ఉన్న అప్పలనాయుడుకి అప్పగించింది.

ఆమె తిరిగి వచ్చేసరికి ఆ బాలికను అక్కడికి సమీపంలో ఉన్న చిన్న గుడి వెనుకకు తీసుకెళ్లిపోయాడు. అక్కడ ఆ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా.. కొందరు స్థానికులు గమనించి అడ్డుకున్నారు. అతనిని పట్టుకొని దేహశుద్ధి చేసి, ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కిశోర్‌కుమార్, సిబ్బందితో అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ద్వారకా ఏసీపీ మూర్తి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. బాలిక నాన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కులాంతర వివాహానికి అడ్డు చెప్పారని..

ప్రాణం తీసిన అతివేగం

టీవీ చూడ్డానికి ఇంటికి వచ్చిన బాలికను..

రెచ్చిపోయిన పచ్చపార్టీ నేతలు.. ఎస్సైకి గాయం

సైకిల్‌ దొంగిలించాడని..

వదినను కొట్టొద్దు అన్నందుకు.. తమ్ముడి హత్య

దారికోసం ఇరువర్గాల ఘర్షణ

భార్య కాపురానికి రాలేదని.. ఆత్మహత్యాయత్నం

వైరల్‌ : నాగిని డాన్స్‌ చేస్తూ చనిపోయాడు

నర్సరావుపేటలో రియాల్టర్‌ దారుణ హత్య

టోల్‌ కట్టమన్నందుకు సిబ్బందిపై అమానుష దాడి

డోన్‌ ఎంవీఐ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

వివాహిత కిడ్నాప్, రోజూ గ్యాంగ్‌ రేప్‌!

మినగల్లులో వ్యక్తి హత్య

తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య

నల్లమలలో వేటగాళ్ల హల్‌చల్‌

ఇంటి దొంగలు సేఫ్‌!

యాచకురాలిపై లైంగికదాడి..

ప్రేమ విఫలమై..

బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతం

విద్యార్థినిని కిడ్నాప్‌కు యత్నించలేదు

రజియాను చంపింది ప్రియుడే

పురుగుమందు తాగి హోంగార్డు ఆత్మహత్య

పురుగులమందు తాగి విద్యార్థి ఆత్మహత్య

లాటరీ మోసగాడి కోసం గాలింపులు

ఘోర విస్ఫోటనానికి 23 ఏళ్లు

ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్తను..

హత్యచేసి బావిలో పడేశారు

మహిళా దొంగలున్నారు.. జర జాగ్రత్త

చేయి తడపనిదే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?

‘వీలు దొరక్కపోతే వీడియోకాల్‌ అయినా చేస్తా..’

నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం

నిజమైన హీరోలకు ఇచ్చే గౌరవమే ‘బందోబస్త్‌’

మాకు పది లక్షల విరాళం