బాలుడిపై వృద్ధుడి లైంగికదాడి

18 Jun, 2018 09:10 IST|Sakshi

ధర్మవరం టౌన్‌: జిల్లాలోని ధర్మవరం పట్టణంలో అమానుషం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలుడిపై ఓ వృద్ధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ధర్మవరం పట్టణంలో మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్న దంపతులు.. కొండన్న అనే వృద్ధుడి ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి రెండో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. ఆదివారం తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడిని కొండన్న చాక్లెట్‌ ఇచ్చి తన గదిలోకి పిలుచుకున్నాడు.

అనంతరం బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో కొండన్న పిల్లాడిని బయటకు పంపి, తనూ అక్కడి నుంచి ఉడాయించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుమారుడిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్‌ జగదీష్‌ తెలిపారు. నిందితుడు కొండన్నను కఠినంగా శిక్షించాలని బాలుడి తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొండన్నపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ హరినాథ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు