వృద్ధుడి దారుణ హత్య

11 Mar, 2018 10:32 IST|Sakshi
హత్యకు గురైన వృద్ధుడు, పక్కన భార్య, ఆమె కుటుంబసభ్యులు

కత్తులతో పొడిచి పరారైన దుండగులు

హత్యానంతరం కనిపించని కుమారులు

ఆస్తి కోసం కొడుకులే చంపారంటున్న హతుడి భార్య 

ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న వృద్ధుడిపై దుండగులు విరుచుకుపడ్డారు. పొత్తికడుపులోకి కత్తులు దూసి పారిపోయారు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించేలోపు ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. కొడుకులే హత్య చేసి ఉంటారని తల్లి ఆరోపిస్తోంది. గుంతకల్లులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

గుంతకల్లు: గుంతకల్లు పట్టణం కసాపురం రోడ్డులోని రెడ్డిస్ట్రీట్‌లో నివాసముంటున్న కసి బసప్ప (68) దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ శ్రీధర్‌రావు, హతుడి భార్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కసి బసప్ప, రామలింగమ్మ దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు (ధనుంజయ్య, శివ, ఆంజనేయులు), ముగ్గురు కుమార్తెలు సంతానం. 48 ఎకరాల పొలం ఉండగా.. ముగ్గురు కుమారులకు చెరి 11 ఎకరాలు చొప్పున (మొత్తం 33 ఎకరాలు) పంచి ఇచ్చారు. మిగిలిన 15 ఎకరాల్లో ఆడపిల్లలకు చెరి ఒకటిన్నర ఎకరం చొప్పున పంచారు. మిగిలిన పదిన్నర ఎకరాలను వృద్ధ దంపతుల తమ జీవనాధారం కోసం పెట్టుకున్నారు. ఆడపిల్లలకు భూమి ఇవ్వడం కుమారులకు ససేమిరా ఇష్టం లేదు. పంపకాల సమయంలోనే తండ్రిపై దాడి కూడా చేసి ఆస్పత్రిపాలు చేశారు. 

భూమి అమ్ముకున్నందుకు గొడవ.. 
వృద్ధ దంపతులు కుటుంబ అవసరాల కోసం తమవద్ద ఉన్న పొలంలో నాలుగు ఎకరాలు అమ్ముకున్నారు. భూ మి ఎలా అమ్ముతారంటూ కుమారులు రోజూ తండ్రితో గొడవపడుతుండేవారు. ఆస్తి పంపకాల గొడవల్లోనే ఆంజనేయులును ధనుంజయ్య, శివ కొట్టి పంపారు.  

కుమారులపై అనుమానం 
ఆస్తి పంపకాల విషయమై బసప్పతో కుమారులు తరచూ గొడవపడుతుండేవారని డీఎస్పీ శ్రీధర్‌రావు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 2016లో బసప్పపై దాడి చేయగా కుమారులు శివ, ధనుంజయ్యలపై రామలింగమ్మ అప్పట్లో కసాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు.  ఆస్తి కోసం తరచూ గొడవపడుతుండటంతో కసాపురం స్టేషన్‌కు పిలిపించి బైండోవర్‌ కూడా చేసినట్లు వెల్లడించారు. బసప్ప హత్యకు గురైన తర్వాత శివ, ధనుంజయ్య కనిపించకుండాపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. 

కొడుకులే చంపారు 
ఆడపిల్లలకు భూమి ఇవ్వడం నా కుమారులకు ససేమిరా ఇష్టం లేదు. ఆ సమయంలోనే మా ఆయనపై దాడి కూడా చేసి ఆస్పత్రిపాలు చేశారు. మాదంపతుల ఖర్చుల నిమి త్తం 4 ఎకరాల భూమిని అమ్మితే.. ఎలా అ మ్ముతారంటూ రోజూ తండ్రి బసప్పతో కు మారులు గొడవ పడుతుండేవారు. ఆస్తి పం పకాల గొడవల్లోనే ఆంజినేయులును ధ నుం జయ్య, శివలు కొట్టి పంపారు. ఇప్పటికీ అం జినేయులు ఎక్కడ ఉన్నాడన్న విషయం తెలియదు. ఆడపిల్లలకు భూమి పంచడమే కాక పొలం అమ్మాడన్న కోపంతో శివ, ధ నుంజయ్యలు తండ్రిని హత్య చేశారు. ఇలాంటి దుస్థితి ఏ దంపతులకూ రాకూడదు. 
– కసి బసప్ప భార్య రామలింగమ్మ 

మరిన్ని వార్తలు