ఓఎల్‌ఎక్స్‌లో కారు ఎరగా చూపి మోసం

9 Feb, 2019 07:39 IST|Sakshi

రూ. 2.19 లక్షలు కాజేసిన వైనం

పశ్చిమగోదావరి, తణుకు: సెకండ్‌ హ్యాండ్‌ వస్తువులు విక్రయించడానికి వేదిగా ఉన్న ఓఎల్‌ఎక్స్‌ యాప్‌లో కారు విక్రయిస్తానని చెప్పి మోసం చేసి ఒక వ్యక్తి నుంచి రూ. 2.19 లక్షలు కాజేసిన సంఘటన తణుకులో చోటు చేసుకుంది. తణుకు పట్టణానికి చెందిన ఒక వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలోని తార్నాకకు చెందిన మరో వ్యక్తి మోసం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకట్రాయపురం ఆంధ్రాసుగర్స్‌లో ఫైనాన్స్‌ మేనేజర్‌గా పని చేస్తున్న తాళ్లూరి వెంకటసత్యరాజేష్‌ అనే వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌లో కారు చూసి కొనేందుకు బేరం మాట్లాడుకున్నారు. తార్నాకకు చెందిన అపరిచిత వ్యక్తి తాను మైనింగ్‌ శాఖలో గెజిటెడ్‌ అధికారినని పరిచడం చేసుకున్నాడు.

దీంతో అతన్ని నమ్మిన రాజేష్‌ పలు దఫాలుగా మొత్తం రూ. 2,19,990 నగదును అతని బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. అయితే కారు గురించి అడగ్గా రిపేరుకు ఇచ్చానంటూ మాయమాటలు చెబుతూ వస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు అతన్ని ఫోన్‌లో నిలదీయడంతో ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు రాజేష్‌ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు