నన్యాలలో జల్లికట్టు.. ఒకరు మృతి

21 Jan, 2018 20:21 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలోని రామకుప్పం మండలం నన్యాలలో జరగుతున్న జల్లికట్టు వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. ఎద్దు ఒకటి జనంలోకి వచ్చి కుమ్మడంతో కుప్పంలోని చందం ఎస్‌ సీ కాలనీకి చెందిన గుణశేఖర్‌(22) మృతిచెందారు. గుణశేఖర్ జల్లికట్టు వీక్షించడానికి చందం ఎస్‌సీకాలనీ నుంచి నన్యాల వచ్చారు.

మరిన్ని వార్తలు