ఈఎస్‌ఐ కుంభకోణంలో మరొకరి అరెస్ట్‌

6 Oct, 2019 14:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐ కుంభకోణంలో మరొకరిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదివారం అరెస్ట్‌ చేసింది. ఫార్మా కంపెనీ ఎండీ సుధాకర్‌రెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్‌గా పని చేస్తున్న నాగలక్ష్మిని  అరెస్ట్‌ చేశారు. ఎనిమిదిన్నర కోట్ల రూపాయల మందుల కొనుగోలు వ్యవహారంలో ఆమె పాత్ర ఉందని తెలుస్తోంది. ఫార్మా కంపెనీ ఎండీ సుధాకర్‌, నాగలక్ష్మి కలిసి పెద్దమొత్తంలో అక్రమాలకు చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. నాగలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్‌ కు తరలించారు. ఈ అరెస్ట్‌తో ఇప్పటి వరకూ ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన వారి సంఖ్య 10కి చేరింది.

లైఫ్‌ కేర్‌ డ్రగ్స్‌ ఎండీ సుధాకర్‌రెడ్డిని అవినీతి ఆరోపణతో పాటు కుంభకోణంలో ఇతరులతో కుమ్మక్కయ్యారనే అభియోగాలతో శనివారం ఏసీబీ అరెస్ట్‌ చేసింది. డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఇతర అధికారులతో కలిసి కుట్ర పన్ని తమ సంస్థకు రూ.8.25 కోట్ల మందుల కొనుగోలు ఆర్డర్‌ను సుధాకర్‌రెడ్డి సంపాదించారని ఏసీబీ పేర్కొంది.

మరిన్ని వార్తలు