వ్యభిచార గృహం నిర్వాహకురాలికి ఏడాది జైలు 

13 Apr, 2018 13:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విశాఖ లీగల్‌: ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మహిళలతో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళకు ఏడాది జైలు, వెయ్యి రూపాయిలు జరిమానా విధిస్తూ నగరంలోని 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.వెంకటరమణా రెడ్డి గురువారం తీర్పు చెప్పారు.

జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నమ్మి సన్యాసిరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితురాలు జి.మధు(41) వన్‌టౌన్‌ ప్రాంతంలోని సున్నపు వీధిలో నివసిస్తోంది. గత కొంతకాలంగా ఆమె మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టేది.

వారిని మాయమాటలతో వ్యభిచారం ఉచ్చులోకి దించేది. ఈ నేపథ్యంలో వివరాలు సేకరించిన వన్‌టౌన్‌ పోలీసులు 2013, ఆగస్టు 27న వలపన్ని పట్టుకున్నారు. నిందితురాలిపై వ్యభిచార నియంత్రణ చట్టం ఐపీసీ సెక్షన్‌3, 4, 7ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నేరాభియోగ పత్రం దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు.  

మరిన్ని వార్తలు