లైంగిక ఆరోపణలు: అవమానభారంతో ఆత్మహత్య

7 Nov, 2019 11:25 IST|Sakshi

ఒంగోలు మారుతీనగర్‌లో కలకలం

ఘటనపై పలు అనుమానాలు

సాక్షి, ఒంగోలు: భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జిల్లా కేంద్రం ఒంగోలులో కలకలం రేపింది. ఓ కేసు విచారణలో భాగంగా ఇంట్లో సోదాలు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఒంగోలు ఇన్‌చార్జి డీఎస్పీ రవిచంద్ర తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 4వ తేదీన స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ బాలిక తనపై ఒక వ్యక్తి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి అత్యాచారం చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై జరుగుమల్లి పోలీసుస్టేషన్‌లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కేసును సింగరాయకొండ సీఐ టి.అజయ్‌కుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసు విచారణలో భాగంగా బాలిక తెలిపిన వివరాల మేరకు ఎస్‌ఐ కమలాకర్‌ ఒంగోలు మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న గోనుకుంట ఏడుకొండలు ఇంట్లో బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఏడుకొండలు ఒక బ్యాగును దాచేందుకు యత్నించబోతుండగా పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగును పరిశీలించిన పోలీసులకు ప్లాస్టిక్‌తో తయారైన కృత్రిమ లైంగిక సాధనం, దానికి ఉపయోగించే బెల్టు ఇతర పరికరాలు కనిపించాయి. వాటిని బయటకు తీసి వివరాలు అడుగుతుండగా ఏడుకొండలు ఇదంతా తన భార్య వల్లే జరిగిందంటూ వాపోయాడు. ఒక్కసారిగా ఆత్మన్యూనతా భావంతో ఆ భవనం పెంట్‌ హౌస్‌ నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసు సిబ్బంది  కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ ఏడుకొండలు కొద్దిసేపటికి మృతి చెందాడు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని, అవమాన భారంతోనే ఏడుకొండలు ఆత్మహత్య చేసుకున్నాడని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. మృతుడి భార్య మగవారి గొంతు, వేషధారణలతో బాలికలను లోబర్చుకుని లైంగిక దాడికి పాల్పడేదని ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగిందనే చర్చ జరుగుతోంది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు