ఛీ.. ప్రాణాల కన్నా సెల్ఫీలే ముఖ్యమా!

11 Jul, 2018 15:04 IST|Sakshi
ఘటనా స్థలంలో సెల్ఫీలు తీసుకుంటున్న ఓ వ్యక్తి

బర్మార్‌(రాజస్థాన్‌) : మనిషి ప్రాణం కన్నా సెల్ఫీలు తీసుకోవడమే ముఖ్యమన్నట్లు ప్రవర్తించి.. ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడానికి బాటసారులు పరోక్ష కారణమయ్యారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని బర్మార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... గుజరాత్‌కు చెందిన పర్మానంద్‌, చంద్రారామ్‌, జమారాం అనే ముగ్గురు వ్యక్తులు లేబర్‌ కాంట్రాక్టర్లుగా పని చేస్తున్నారు.

తమ ప్రాంతంలో పని చేసేందుకు కార్మికులు అవసరం ఉండటంతో రాజస్థాన్‌లోని బర్మార్‌కు వచ్చారు. బైక్‌పై ప్రయాణిస్తున్న వీరిని స్కూలు బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లి తమను కాపాడాల్సిందిగా రోడ్డుపై వెళ్తున్న వారిని వేడుకున్నారు. అయితే రక్తపు మడుగులో కొట్టు మిట్టాడుతున్న బాధితులతో సెల్ఫీలు దిగుతూ, వీడియోలు షూట్‌ చేస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ కూడా వారిని కాపాడే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సాటి మనుషుల ప్రాణాలు కాపాడకుండా ఫొటోలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ.100 కోట్ల నగదు, 100 కిలోల పసిడి స్వాధీనం

ఫోన్‌ కోసం ప్రాణం తీశాడు

దొంగ రాంబాబు.. భలే రుబాబు

విజయవాడలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌

పోలీస్‌ పోస్ట్‌లో బాలిక మృతిపై..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌

రిపోర్టర్‌ యాక్షన్‌

థ్రిల్లర్‌ లవ్‌స్టోరీ

చిన్న సినిమాలను ప్రోత్సహించాలి

అప్పుడు ఆలియా చిన్నపిల్ల

దోచుకోవాలని...