పగలు పెయింటింగ్‌...రాత్రిళ్లు చోరీలు

3 Nov, 2018 09:19 IST|Sakshi

యూపీ ముఠా అరెస్ట్‌

శంషాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో భారీ చోరీ

పట్టుకున్న శంషాబాద్‌ సీసీఎస్, ఆర్‌జీఐఏ పోలీసులు

రూ.30 లక్షల విలువైన బంగారం, వజ్రాలు స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: పెయింటర్లుగా ఇంటికి రంగులు వేస్తూ రెక్కీలు నిర్వహిస్తూ రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యులతో కూడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్‌ సీసీఎస్, ఆర్‌జీఐఏ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన 15 తులాల బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌ జిల్లా గద్వాచౌరకు చెందిన  మహమ్మద్‌ అబేద్‌ ఆలీ కూరగాయల వ్యాపారం చేసే తండ్రికి చేదోడు వాదోడుగాఉండేవాడు.  అదే ప్రాంతానికి చెందిన మోహన్‌ యాదవ్‌తో కలిసి కిరాణా దుకాణం లో రూ.50 వేలు దొంగిలించిన కేసులో వీరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2018 జనవరిలో జైలు నుంచి విడుదైన తర్వాత మోహన్‌ బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌ వలస వచ్చి గొల్కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం అబేద్‌ ఆలీ, తన స్నేహితుడు షేక్‌ ఫరూక్‌ హుస్సేన్‌తో కలిసి నగరానికి వచ్చి మోహన్‌యాదవ్‌తో కలిసి ఉంటున్నారు. 

పెయింటర్లుగా పని చేసే వీరు జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్నారు. నెల రోజుల క్రితం శంషాబాద్‌ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌కు రంగులు వేసేందుకు వెళ్లిన వారు ఇంట్లో వృద్ధ దంపతులు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి చోరీకి పథకం పన్నారు. ఇందులో భాగంగా అర్ధరాత్రి  ఫామ్‌హౌస్‌కు చేరుకున్న వీరిలో మోహన్‌ యాదవ్‌ బయట కాపలా ఉండగా అబేద్‌ ఆలీ, ఫరూక్‌ హుస్సేన్‌ ఇంటి గ్రిల్స్‌ తొలగించి కిటికీ ద్వారా లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తీసుకొని పారిపోయారు. పోలీసులు ఘటనాస్థలిలో సేకరించిన వేలిముద్రల ఆధారంగా యూపీకి చెందిన పాతనేరగాళ్ల పనిగా గుర్తించారు. వృద్ధ దంపతులను విచారించగా ఇంటికి రంగులు వేసేందుకు యూపీకి చెందిన వారు వచ్చినట్లు చెప్పడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. గోల్కొండలో  అద్దె గదిలో ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన వజ్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రత్యేకంగా కృషి చేసిన శంషాబాద్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు, బాలానగర్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌లతో పాటు ఇతర సిబ్బందిని సీపీ సన్మానించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దారుణం: బాలిక దారుణ హత్య

ఐఎంఏ జ్యువెల్స్‌ అధినేత అరెస్టు 

బిహార్‌లో మూకదాడి.. ముగ్గురి మృతి 

ఛత్తీస్‌గఢ్‌లో ఓయూ విద్యార్థి అరెస్ట్‌ !

క్లాస్‌ లీడర్‌ కాలేదని..

అనుమానంతో భార్యను.. అడ్డువచ్చిన అత్తను..

వైరల్‌: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌

విషాదం: ఎనిమిది మంది చిన్నారుల మృతి

విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..

వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

అపూర్వ శుక్లాపై చార్జీ షీట్‌ దాఖలు

కన్నతల్లి కర్కశత్వం; చిన్నారి గొంతుకోసి..

హల్దీ బచావో..

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

వివాహేతర సంబంధం: భర్తకు తెలియకుండా 95 వేలు..

తనతో ప్రాణహాని; అందుకే నేనే చంపేశా!

వేటాడుతున్న నాటు తూటా

ఐదేళ్ల తర్వాత ప్రతీకారం..!

ఒంటరి మహిలళే వారి టార్గెట్‌!

ప్రియురాలి ఇంటి ఎదుట ప్రియుడి ఆత్మహత్య

ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ మృతి

మోసం: వయస్సు తప్పుగా చెప్పి పెళ్లి!

మలుపులు తిరుగుతున్న శిశువు కథ

ఉద్యోగమని మోసం చేసిన డీఎస్పీ!

అమ్మాయి చేతిలో ఓడిపోయానని..

దొంగలు బాబోయ్‌.. దొంగలు 

ప్రేమ... పెళ్లి... విషాదం...

నమ్మించాడు..  ఉడాయించాడు!

చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలతో కుచ్చుటోపీ!

విదేశీ ఖైదీ హల్‌చల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటికి ముందస్తు బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష