భూవివాదంలో పల్లె రఘునాథరెడ్డి

10 Aug, 2018 15:50 IST|Sakshi
ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి(ఫైల్‌)

సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి భూవివాదంలో చిక్కుకున్నారు. వైఎస్సార్‌ సీపీ నేత, హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త నదీం అహ్మద్‌కు చెందిన భూముల్లో పల్లె వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. పల్లె రఘునాథరెడ్డి గతంలో ఆలమూరు గ్రామం వద్ద వ్యవసాయ కళాశాల కోసం 206 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ భూమిపై హైకోర్టులో కేసు ఉండగానే ఆయన రిజిస్టర్‌ చేసుకున్నారు. పోలీసుల అండతో భూమిని స్వాధీనం చేసుకున్నారు.

దీనిపై నదీం అహ్మద్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. తన తల్లికి చెందిన భూమిని అక్రమంగా పల్లె రఘునాథరెడ్డి కోసుగోలు చేశారని ఆరోపించారు. హైకోర్టులో కేసు ఉండగా రిజిస్టర్‌ చేయించుకోవటం తప్పని అన్నారు. పోలీసుల అండతో పల్లె దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. ఏపీ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  

మరిన్ని వార్తలు