శ్రావణి హత్య కేసులో విచారణ వేగవంతం

29 Apr, 2019 09:39 IST|Sakshi
మండల కేంద్రంలో సీసీ కెమెరాలకు  మరమ్మతులు చేస్తున్న సిబ్బంది, హాజీపూర్‌ శివారులో శ్రావణి మృతదేహన్ని పూడ్చిన తెట్టె బావి

పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు

మత్తుకు బానిసైన యువతపైనే ఖాకీల దృష్టి

బొమ్మలరామారం (ఆలేరు) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే సంచలనంగా మారిన మండలంలోని హాజీపూర్‌ గ్రామానికి చెందిన పాముల శ్రావణి హత్య కేసు విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో ఈ ప్రాంత కొంత మంది యువత గంజాయి, కొకైన్‌లాంటి మత్తుపదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. మత్తు ప్రభావంతోనే నేరాలకు పాల్ప డుతున్నారనే ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

పోలీసుల అదుపులో..
అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రావణి కే సులో సైతం డ్రగ్స్‌కు బానిసైన యువత పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఆదివారం మండల కేంద్రంలో ఇద్దరు, హాజీ పూర్‌ గ్రామంలో ఆరుగురు యువకులను ఎస్‌ఓటి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

గతంలో మండలంలోని మల్యాల గ్రామ శివారులోని ఓ ఫాలీ హౌస్‌లోని ఆంధ్రా మహిళ అనుమానాస్పద మృతిపైనా పోలీ సులు దృష్టిసారించారు. ఈ కేసులో సైతం డగ్స్‌కు అలవాటు పడిన పలువురు యువకుల ప్రమేయం ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ కోణంలోనే పో లీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు మండల యువతకు డ్రగ్స్‌ ఎలా సరఫరా అవుతోందని అం తుచిక్కని ప్రశ్నగా మిగిలింది. మీస్టరీగా మారిన ఈ హత్య కేసుల్లో నేరస్తులు ఎవరోనని మండల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

యుద్ధప్రాతిపదికన సీసీ కెమెరాల మరమ్మతులు
దర్యాప్తులో కీలకంగా మారిన సీసీ కెమెరా పనితీ రు అధ్వానంగా మారడంతో పోలీసులకు ఈ హత్య కేసు విచారణ జటిలంగా మారింది. గతంలో మండలంలో 13 గ్రామాల్లో 61 కెమెరాలు ‡ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడ సీసీ కెమెరాలు పనిచేయడడం లేదు. ఈ నేపథ్యంలో శ్రావణి హత్య కేసును ఛేదించడంలో పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శ్రావణిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలనేæ తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో ఆందోళనలు జరిగాయి. సీపీ మహేష్‌ భగవత్‌ సైతం మండలంలో సీసీ కెమెరాలను తక్షణమే మరమ్మతులు చేస్తామని హమీ ఇచ్చారు. దీంతో మండలంలో గల సీసీ కెమెరాలన్నింటినీ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నారు.

మరిన్ని వార్తలు