భార్య చేసిన పనికి కూతురు హత్యకు గురి కావడంతో..

11 Jul, 2020 16:00 IST|Sakshi

సాక్షి, మేడ్చల్, యాదాద్రి‌ : వారం రోజుల క్రితం ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్రమ సంబంధం నేపథ్యంలో అయిదేళ్ల చిన్నారి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ  ఘటనలో కూతురి మరణాన్ని తట్టుకోలేకపోయిన చిన్నారి తండ్రి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. భువనగిరి ప్రాంతానికి చెందిన కళ్యాణ్‌ 2011లో అనూష అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2015లో ఆద్య అనే చిన్నారి జన్మించింది. రెండు సంవత్సరాలుగా ఈ దంపతులు ఘట్కేసర్‌ పరిధిలోని ఇస్మాయిల్‌ ఖాన్‌గూడలో నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా కళ్యాణ్‌ యాదాద్రి జిల్లా ఆత్మకూరులో గ్రామ కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. (డిగ్రీ విద్యార్థిని లైవ్ డెత్!)

ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం అనూషకు కరుణాకర్‌ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదిలా కొనసాగుతుండగా ఇటీవల కరణాకర్‌ను దూరం పెడుతూ.. అనూష మరో స్నేహితుడు రాజశేఖర్‌తో చనువుగా ఉంటోంది. ఇది తట్టుకోలేని కరుణాకర్‌ గురువారం అనూష ఇంటికి వెళ్లాడు. అప్పటికి ఇంట్లో రాజశేఖర్‌ ఇండటంతో ఆవేశానికి లోనైన కరుణాకర్‌ అతన్ని బయటకు రావాలని హెచ్చరించాడు. లేకుంటే తన వెంట తెచ్చుకున్న సర్జికల్‌ కత్తితో బయట ఆడుకుంటున్న అనూష కూతురు ఆద్యను చంపేస్తానంటూ బెదిరించాడు. అతని మాటలను పట్టించుకోకపోవడంతో కరుణాకర్‌ వెంటనే చిన్నారి గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. ఇది జరిగిన వారం రోజుల్లోనే తండ్రి కళ్యాణ్‌ మానసికంగా కుంగిపోయి భువనగిరి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు.  (ప్రేమికురాలిని హత్య చేసిన ప్రేమికుడు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా