యువకుడి ఆత్మహత్య

30 Mar, 2020 07:43 IST|Sakshi
మహేష్‌ (ఫైల్‌)

దౌల్తాబాద్‌: జీవితంపై విరక్తిచెంది ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉదయం మండలంలోని బిచ్చాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వడ్లమహేష్‌(32) ఏడాదిన్నర క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి భార్యభర్తలు హైదరాబాద్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం అమ్మాయి తల్లిదండ్రులు వివాహితను గ్రామానికి రప్పించుకున్నారు.

అప్పటి నుంచి మహేష్‌ ఒక్కడే ఉన్నాడు. రెండు రోజుల క్రితం మహేష్‌  కరోనా వైరస్‌ నేపథ్యంలో తన సొంత ఇంటికి వచ్చాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కులాంతర వివాహం చేసుకున్నందుకు మహేష్‌ను ఇంట్లోకి రానివ్వకపోవడంతో జీవితంపై విరక్తి చెంది పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టు పక్కల వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి రాములు ఫిర్యాదు మేరకు అనుమానస్పదస్థితి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు