చిన్నారి మృతికి కారకులపై చర్యలేవి..?

14 Apr, 2018 12:11 IST|Sakshi
ఆందోనళ చేస్తున్న చిన్నారి బంధువులు

ఎనిమిది నెలలైనా     స్పందిచని వైద్యాధికారులు

ఇల్లందకుంటలో బాధితుల ఆందోళన

పీహెచ్‌సీ ఎక్కి8 గంటల పాటు నిరసన

అధికారుల హామీతో     విరమణ

ఇల్లందకుంట(హుజూరాబాద్‌): ‘నెలసూదికని.. చిన్నారిని ఆస్పత్రికి తీసుకొస్తే.. వైద్యులు నిర్లక్ష్యంతో వ్యవహరించి ప్రాణం తీశారని, బాధ్యులపై చర్య తీసుకోవాలని ఎనిమిది నెలలుగా పోరాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని’ సదరు చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు శుక్రవారం ఇల్లందకుంట పీహెచ్‌సీ ఎదుట ఆందోళన చేశారు. పీహెచ్‌సీ భనవం ఎక్కి 8 గంటలు నిరసన వ్యక్తం చేశారు. బాధితుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన  అప్పా ల విజయ్‌– హారిక దంపతులకు 45రోజుల కూతురు ఉండేది. గతేడా ది అక్టోబర్‌11న ప్రభుత్వాస్పత్రిలో వేసిన ఇంజక్షన్‌ వికటించి మృతి చెం దింది.

చిన్నారి మృతికి కారణమైన వారిపై చర్య తీసుకోవాలని అప్పటి నుంచి తిరుగుతున్నా అధికారులు వచ్చి నివేదికలు పంపిస్తున్నారు తప్పా.. తమ కూతురు మృతికి గల కారణాలు తెల్పడం లేదని చిన్నారి తండ్రి ఆరోపిస్తున్నాడు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన చిన్నారి బంధువులు, తల్లిదండ్రులు పీహెచ్‌సీ ఎదుట ఆందోళన చేశారు. భనవం పైకి ఎక్కి దాదాపు 8 గంటలు నిరసన వ్యక్తం చేశారు. సీఐ నారాయణ అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. జిల్లా వైద్యాధికారికి పరిస్థితితి వివరించారు. 15రోజుల్లో నివేదిక అందిస్తామని జిల్లా ప్రత్యేకాధికారి సుధాకర్‌ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. 

మరిన్ని వార్తలు