వైద్యుల నిర్లక్ష్యంతోనే మా బాలుడు మృతి

29 Jun, 2020 17:31 IST|Sakshi

లక్నో‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రాణాలు కాపాడే వైద్యులే నిర్లక్ష్యం వహించడంతో ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కానౌజ్‌ నగరంలో చోటు చేసుకుంది. తీవ్రమైన జ్వరం, మెడ భాగంలో వాపు ఉన్న బాలుడుని కానౌజ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి ఆదివారం సాయంత్రం ఆ బాలుడి తల్లిదండ్రులు తరలించారు. కానీ అక్కడి వైద్యులు కనీసం బాలుడికి ఏం అయిందని తెలుసుకోకుండా ఇక్కడ చికిత్స అందించలేము కాన్పూర్‌లోకి ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. దీంతో దిక్కుతోచని బాలుడి తల్లిదండ్రులు ఆశాదేవి, ప్రేమ్‌ చంద్‌ తమ పిల్లవాడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందించాలని పలుమార్లు వైద్యులను కోరారు. ఆస్పత్రిలోని ఉన్నకొంతమంది ఈ ఘటనను మోబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించారు. దీంతో తమ పిల్లవాడికి ఏం అయిందని వైద్యులు చూశారని అంతకు ముందు కనీసం తాకడానికి కూడా ఇష్టపడలేదని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన 30 నిమిషాల తర్వాత వైద్యులు సరిగా పట్టించుకోకపోవటంతో బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేశారు. (ఇసుక వివాదం: త‌ండ్రీ, కొడుకు‌ల హ‌త్య‌..)

‘నేను పేదవాడిని మా బాలుడిని కనీసం తాకకుండా కాన్పూర్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లండని వైద్యులు అన్నారు. నా దగ్గర డబ్బులేదు. నేను ఏం చేయాగలను. కేవలం ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం కారణంగా మా చిన్నారి మృతి చెందాడు’ అని తండ్రి ప్రేమ్‌చంద్‌ తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ ‌మీడియాలో వైరల్‌గా మారింది. అదే విధంగా దీనిపై కనౌజ్‌ ప్రభుత్వ అధికారి రాజేష్‌ కుమార్‌ మీశ్రా స్పందిస్తూ.. చిన్నారిని వైద్యులు అత్యవసర వార్డుకు చేర్చారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని చైల్డ్‌ స్పెషలిస్ట్‌ను కూడా‌ పిలిచారు. కానీ, తీసుకువచ్చిన 30 నిమిషాలల్లో బాలుడు మృతి చెందాడు. వైద్యులు తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ, బాలున్ని రక్షించలేకపోయారు. వైద్యులు ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదు’ అని తెలిపారు. (వీళ్లు మనుషులు కాదు రాక్షసులు)

మరిన్ని వార్తలు