దేవుడి సాక్షిగా నరబలి!

13 Jul, 2019 10:31 IST|Sakshi
ఘటనా స్థలంలో పోలీస్, రెవెన్యూ అధికారులు

సాక్షి, శిరివెళ్ల(కర్నూలు) : నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీ సర్వ నరసింహస్వామి ఆలయ సమీపంలోని వక్కిలేరు వాగులో పూడ్చిన శవాన్ని శుక్రవారం బయటకు తీశారు. తల నరికి వేయడం.. మృతదేహం పక్కన నిమ్మకాయ ఉండడంతో ఇది నరబలి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాగులో వజ్రాల అన్వేషణ కోసం వచ్చిన ఓ వృద్ధుడు..గురువారం  పూడ్చిన శవం కాలి వేలు బయట పడడాన్ని గమనించాడు. భయాందోళనకు గురై  విషయాన్ని ఆలయ సిబ్బందికి తెలియ చేయగా వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్‌ జిలానీ, ఆర్‌ఐ ఉశేనిబాషా సçమక్షంలో సర్కిల్‌ ఎస్‌ఐలు చంద్రశేఖరరెడ్డి, రామిరెడ్డి ఆధ్వర్యంలో పూడ్చిన శవాన్ని బయటకు తీశారు. 25–30 ఏండ్ల వయస్సున్న వ్యక్తి తల నరికినట్లు ఉంది. అదిగాక గుంతలో శవం పక్కను నిమ్మ కాయ కూడా ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. జీన్స్‌ ఫ్యాంట్, రెడ్‌ పుల్‌ షర్టు, ఎర్రని శరీర వర్ణచ్ఛాయతో చేతి వేలికి కాపర్‌తో తయారు చేతిన ఉంగరం ఉంది. మొలతాడు లేదు. నంద్యాల ప్రభుత్వ వైద్యశాల డాక్టర్‌ రామిరెడ్డి ఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

తలను  దేహం నుంచి  నరికినట్లు డాక్టర్‌ నిర్ధారించారు. కాగా వ్యక్తిని ఘటనా స్థలం నే హత్య చేసి పూడ్చి పెట్టారా ? లేక ఎక్కడో హత్య చేసి ఇక్కడ పూడ్చి పెట్టారన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాగా వ్యక్తి కాలి వేలికి రింగ్‌ మాదిరిగా ఉంది. కాలి నొప్పి ఉన్న వారు ఇలా వేయించుకుంటారని స్థానికులు చెబుతున్నారు. మహదేవపురం వీఆర్వో శ్రీకాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టు మార్థం అనంతరం మృత దేహాన్ని అక్కడే పూడ్చి వేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్‌

కాగ్నిజెంట్‌ ఉద్యోగి ఆత్మహత్య

బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

రూ. 3.3 కోట్లు దోచేసి.. దర్జాగా..

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

తల ఛిద్రం; మోడల్‌ దారుణ హత్య

బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

గిద్దలూరు వాసి చిత్తూరులో ఆత్మహత్య

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన యువతి..

అంత్యక్రియల అనంతరం నిలదీస్తే.. ఒప్పుకొన్న భర్త

తల్లి జబ్బుపడిందని.. కుమార్తె ఆత్మహత్య

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

తమ్ముడిపై కొడవలితో దాడి

పోలీసునంటూ షాపులో దౌర్జన్యం

యువకుడి మృతదేహం లభ్యం

లారీ డ్రైవర్‌పై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి

టోల్‌గేట్‌ బిల్లింగ్‌ బూత్‌ను ఢీకొన్న లారీ

క్యాషియర్‌పై దాడి చేసి దోపిడీ

అనంతపురంలో క్షుద్రపూజల కలకలం!

నిర్లక్ష్య‘భటులు’..!

కలిదిండిలో కక్షతో.. భర్త లేని సమయంలో దాడి!

ఇటీవలే శ్రీలంక పర్యటన.. క్షణికావేశంలో ఆత్మహత్య

ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో...!

వివాహేతర సంబంధంపై అనుమానంతో..

మాట్లాడుతుండగా పేలిన సెల్‌ఫోన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’