పదహారేళ్లకే నిండునూరేళ్లు.. 

4 Aug, 2019 06:52 IST|Sakshi

సాక్షి, బెల్లంపల్లి : పదహారేళ్లకే ఆ బాలుడికి నిండునూరేళ్లు నిండాయి. కుటుంబ పోషణకు ఆసరాగా ఉంటుందనుకున్న ట్రాక్టర్‌ ఆ ఇంటి దీపాన్ని ఆర్పివేసింది. జీవనోపాధిని అందించే ఆ ట్రాక్టర్‌ చివరికి ఆ బాలుడి పాలిట మృత్యుశకటమైంది. ట్రాక్టర్‌ యజమాని ధనాపేక్ష ఓ ప్రాణాన్ని పొట్టన పెట్టుకోవడం కలకలం రేపింది. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మల్లమ్మ, నర్సయ్య దంపతుల కుమారుడు కుమ్మరి మల్లేశ్‌ (16) కొన్ని సంవత్సరాలుగా కూలి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.

ఈ క్రమంలో బుధాకుర్థు గ్రామ పంచాయతీలోని కాసిరెడ్డిపల్లెకు చెందిన ముత్తె మల్లేశ్‌కు చెందిన ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనికి కుదిరాడు. ఏడాదిన్నర కాలంగా ట్రాక్టర్‌ నడుపుతూ తన వయస్సుకు మించిన పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. శనివారం ఒంట్లో బాగాలేదని మల్లేశ్‌ ఇంట్లోనే ఉండిపోయాడు. ట్రాక్టర్‌ యాజమాని మల్లేశ్‌ ఓ వ్యక్తిని ఇంటికి పంపించి బాలున్ని పనికి తీసుకువచ్చాడు. కాసిరెడ్డి పల్లె శివారులో తిరుపతి అనే ఓరైతు పొలంలో ట్రాక్టర్‌తో వీల్స్‌ కొడుతుండగా ఒక్కసారిగా ట్రాక్టర్‌ తిరగబడింది.

దీంతో డ్రైవర్‌ మల్లేశ్‌  ట్రాక్టర్‌ కింద బురదలో కూరుకుపోయాడు. బయటకు రాలేక ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన చుట్టుపక్కల వారు ట్రాక్టర్‌ను పక్కకు తొలగించే ప్రయత్నం చేసినా అది సాధ్యంకాలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో తాళ్ల గురిజాల ఏఎస్సై నూతి లింగన్న సంఘటన స్థలానికి చేరుకున్నాడు. మరికొందరి సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.  

కుటుంబ సభ్యుల ఆందోళన 
పోస్టుమార్టం కోసం  మృతదేహాన్ని తరలించేందుకు సిద్ధం కాగా బాలుని కుటుంబీకులు, స్థానికులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని తీసుకెళ్లి ట్రాక్టర్‌ యజమాని ఇంటి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. పనికి రానని చెప్పినప్పటికీ యాజమాని బలవంతంగా తీసుకెళ్లి ప్రాణాలు బలిగొన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి రూ.15ల నష్టపరిహారం ఇవ్వాలని పట్టుబట్టారు. దాదాపు మూడుగంటల పాటు ఆందోళన  చేశారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లిరూరల్‌ సీఐ అల్లం నరేందర్‌  ఘటనా స్థలికి  చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు.

మృతుని కుటుంబానికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సందర్భంగా సీఐ నరేందర్‌ మాట్లాడుతూ బలవంతంగా మల్లేశ్‌ను పనికి తీసుకు వెళ్లినందుకు, మైనర్‌ బాలుడిని పనిలో పెట్టుకున్నందుకు ట్రాక్టర్‌ యజమాని ముత్తె మల్లేశ్‌పై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆమెతో చాటింగ్‌ చేసి అంతలోనే..

దండుపాళ్యం బ్యాచ్‌లో ఇద్దరి అరెస్టు

కాల్పుల కలకలం.. 20 మంది మృతి

ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు

ఎంత పని చేశావు దేవుడా!

కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్‌

రాష్ట్రానికో వేషం.. భారీగా మోసం

అలా రూ. 2 కోట్లు కొట్టేశాడు

కాలేజీ విద్యార్థిని హత్య ; కోర్టు సంచలన తీర్పు.!

మీడియా ముందుకు మోస్ట్‌ వాంటెడ్‌ కిడ్నాపర్‌

లాయర్‌ ఫీజు ఇచ్చేందుకు చోరీలు

దారుణం: పీడకలగా మారిన పుట్టినరోజు

టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు

కుక్కకు గురిపెడితే.. మహిళ చనిపోయింది!

మద్యంసేవించి ఐఏఎస్‌ డ్రైవింగ్‌.. జర్నలిస్ట్‌ మృతి

తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య

బ్యుటీషియన్‌ ఆత్మహత్య

ఏడో తరగతి నుంచే చోరీల బాట

నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు

ప్రేమపెళ్లి; మరణంలోనూ వీడని బంధం

నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఇంట్లో అందర్నీ చంపేసి.. తాను కూడా

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

తీవ్రంగా కొట్టి..గొంతు నులిమి చంపాడు

పెళ్లి చేసుకున్నాడు.. వదిలేశాడు!  

శిశువును రూ. 20 వేలకు అమ్మడానికి సిద్ధపడింది

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అరెస్ట్‌

స్టేషన్‌లో నిందితుడి పుట్టినరోజు వేడుక

రూ. 1.30 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం