-

వరుడి పేరుతో మోసం.. వ్యక్తి అరెస్ట్‌

28 Dec, 2017 09:33 IST|Sakshi

సాక్షి, అన్నానగర్‌: చెన్నై సమీపం మాధవరంలో తన కూతురుకి వరుడు కావాలని ఇంటికి వచ్చి నగదు చోరీ చేసుకుని పరారైన వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. పొన్నిఅమ్మన్‌ మేడుస్వామి నగరానికి చెందిన సుబ్రమణి(64). ఇతని భార్య కమలం. ఇంజినీర్‌గా పని చేస్తూ వస్తున్న తన కుమారుడికి సుబ్రమణి వరన్‌ను వెతికాడు. 13వ తేదీన 55 ఏళ్ల ఓ వ్యక్తి ఇతని ఇంటికి వచ్చాడు. అతను తిరువరంగడమ్‌కి చెందిన సంతాన గోపాలన్‌గా వారికి పరిచయం చేసుకున్నాడు. 

తరువాత సంతాన గోపాలన్‌ తన కుమార్తెకి వరుడిని చూస్తున్నానని వారిని నమ్మించాడు. దీంతో వారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లమని తెలిపారు. సాయంత్రం ఇంటికి వెళ్తానన్న అతనికి స్వీట్‌బాక్స్‌ ఇచ్చి పంపారు. కాగా మరుసటిరోజు కుమారుడి వివాహం కోసం బీరువాలో ఉంచిన రూ.1,85,000 నగదు కనిపించలేదు. సుబ్రమణికి సంతాన గోపాల్‌ మీద అనుమానంతో మాధవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సెల్‌ఫోన్‌ నెంబర్‌ పట్టించింది..
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. సంతానగోపాలన్‌ మరచిపోయి సుబ్రమణికి ఇచ్చిన సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా అతని అడ్రస్‌ కనిపెట్టారు. మంగళవారం తిరువరంగం వలైందాన్‌ వీధిలోని అతని ప్రత్యేక పోలీసులు పట్టుకుని చెన్నైకి తీసుకుని వచ్చారు. విచారణలో సుబ్రమణి ఇంట్లోని నగదు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు అతని దగ్గర ఉన్న రూ.1,75,000 నగదుకు స్వాధీనం చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు