వేములవాడలో బాలికపై దారుణం

2 Jul, 2019 08:23 IST|Sakshi

సాక్షి, వేములవాడ : అతను ఆ బాలికకు వరుసకు బావ.. చనువుగా ఉండడాన్ని చూసి బాలికను లోబర్చుకుని గర్భవతిని చేశాడు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని శాలరామన్నపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం. శాలరామన్నపల్లి గ్రామానికి చెందిన లచ్చయ్య–సారవ్వ దంపతుల కూతురు(15) గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌లోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. వరుసకు బావ అయిన సాయి బాలికను లోబర్చుకుని గర్భవతిని చేశాడు. బంధువుల ద్వారా కుటుంబసభ్యులకు విషయం తెలిసింది. దీంతో ఇటీవల కులపెద్దల సమక్షంలో పంచాయితీ జరి గింది. ఈక్రమంలోనే యువకుడికి మరో యువతితో వరపూజ జరిగింది. సమస్య జటిలమైంది.

బాలిక అంశం పంచాయితీకి రావడవంతో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఆ తర్వాత అబార్షన్‌ చేయించాలని నిర్ణయించుకున్నారు. సిరిసిల్లలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అబార్షన్‌కు సంబంధించి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బాలిక ను తీసుకుని వేములవాడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా.. బాలి కకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమెను ఠాణా ఎదుట గల సులభ్‌ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లారు. అక్కడే బాలికకు గర్భస్రావమైంది. బాధితురాలిని తక్షణమే స్థానకంగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. తల్లి సారవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా