మానుకోటలో మర్డర్‌ కలకలం

23 Sep, 2019 08:34 IST|Sakshi
మృతుడి భార్య శాంతితో మాట్లాడుతున్న డీఎస్పీ నరేష్‌కుమార్, రూరల్‌ సీఐ

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

విచారణ జరుపుతున్న పోలీసులు

సాక్షి, మహబూబాబాద్‌ రూరల్‌: మానుకోటలో మర్డర్‌ కలకలం రేపింది. మండలంలోని రేగడితండా గ్రామ శివారులో గల బీడు భూమిలో ఓ యువకుడు శనివారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. అతడిని గుర్తు తెలియని దుండగులు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు. డీఎస్పీ నరేష్‌కుమార్‌ కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జి ల్లా కేంద్రం శివారులోగల మంగలికాలనీకి చెం దిన ఇన్నారపు నవీన్‌ హౌస్‌ పెయింటింగ్‌ వృత్తి చేస్తుండగా భార్య శాంతి ఇందిరాగాంధీ సెంటర్‌లో కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రేగడితండా గ్రామ పరిధి లో గల టేకులతండాకు చెందిన శాంతితో పదేళ్ల క్రితం ఇన్నారపు నవీన్‌కు ప్రేమ వివాహం జరిగింది.

రోజు మాదిరిగానే నవీన్‌ ఉదయం పనికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాక బయటకు వెళ్లి వస్తానని భార్యతో చెప్పి రాత్రి 9:30 గంటల వరకు కూడా తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురై న శాంతి తన సోదరులకు విషయం చెప్పి నవీన్‌ కోసం గాలించారు. రేగడితండా గ్రామ శివారులోగల బీడు భూమి సమీపంలో నవీన్‌ తన హో ండా యాక్టివా బండి కిందపడి ఉండటంతో పా టు అతడు ఆ బండిపైనే మృతి చెంది కనిపించా డు. కాగా, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సంఘటనా స్థలంలో మద్యం సేవించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆ సమయంలోనే వారికి, నవీన్‌కు మధ్య ఏమి జరిగిందో ఏమో కానీ అతడిని కొట్టి చంపేసి వాహనంపై నుంచి పడి మృతి చెందిన విధంగా చిత్రీకరించి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

మృతుడి తలపై రెండు బలమైన గాయాలై రక్తస్రావం జరగడంతో పాటు గొంతుపై గట్టిగా నొక్కి మృతి చెందే విధంగా ప్రయత్నించడంతో అతడి నాలుక కూడా బయటకు వచ్చింది. నవీన్‌ హత్యకు గల కారణాలు తెలుసుకుని విచారణ జరుపుతామ ని, త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని డీఎస్పీ నరేష్‌కుమార్‌ తెలిపారు. రూరల్‌ సీఐ జూపల్లి వెంకటరత్నం, కురవి ఎస్సై జె.శంకర్‌రావు వివరాలు సేకరించారు. సంఘటన స్థలంలో చిల్లర డబ్బులు, మద్యం గ్లాసులు, ఒక బెడ్‌షీట్‌ లభ్యమయ్యాయి. క్లూస్‌టీం వివరాలు సేకరించగా, డాగ్‌స్క్వాడ్‌ బృందాలు సంఘటన స్థలాన్ని పరిశీలించాయి. రూరల్‌ ఎస్సై సీహెచ్‌.రమేష్‌బాబు, కురవి, మహబూబాబాద్‌ రూరల్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కాగా, మృతుడు నవీన్‌ భార్య శాంతిని వివరణ కోరగా తమ భార్యాభర్తల మధ్య ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని, ఏమి చెప్పకుండా మద్యం బాటిల్‌ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పింది. నవీన్‌ హత్యపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవీన్‌ మృతితో కుమార్తె వైష్ణవి, కుమారుడు వికాస్‌ అనాథలుగా మారా రు. మృతుడు నవీన్‌ మృతదేహాన్ని సంఘటన స్థలంలో పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమగ్ర విచారణ కోసం భార్య శాంతిని కురవి పోలీసులు తీసుకెళ్లినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు