ప్రధానమంత్రిని చంపాలని చూశారు!

6 Dec, 2017 09:18 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌లో భారీ ఉగ్రవాద కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. బ్రిటన్‌ ప్రధానమంత్రి థెరిసా మేను చంపేందుకు ఇద్దరు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ప్రధాని నివాసమైన డౌనింగ్‌ స్ట్రీట్‌ గేట్లు పేల్చేసి.. ఆ సందర్భంగా తలెత్తిన గందరగోళం నడుమ ప్రధాని మేను హతమార్చాలని భావించారు. ఈ మేరకు కుట్రపన్నిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలు అరెస్టుచేసినట్టు స్కై న్యూస్‌ తెలిపింది.

ఉత్తర లండన్‌కు చెందిన నాయిముర్‌ జకారియా రహ్మన్‌ (20)ను, వాయవ్య బర్మింగ్‌హామ్‌కు చెందిన మహమ్మద్‌ అకిబ్‌ ఇమ్రాన్‌ (21)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద కుట్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని బుధవారం వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ‘డౌనింగ్‌ స్ట్రీట్‌ వద్ద ఇంప్రూవ్‌డ్‌ పేలుడు పదార్థాలు (ఐఈడీ) పేల్చి.. గందరగోళం రేపి.. ఆ క్రమంలో థెరిసా మేను చంపాలని వీరు కుట్రపన్నారు’ అని స్కై న్యూస్‌ ఒక కథనంలో తెలిపింది.
 

మరిన్ని వార్తలు