పీఎంసీ స్కాం : హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్లకు షాక్‌

16 Jan, 2020 14:46 IST|Sakshi

బాంబే హైకోర్టు ఆర్డర్‌పై  సుప్రీం కీలక ఆదేశాలు

సాక్షి,న్యూఢిల్లీ: పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో  సుప్రీంకోర్టు కీలక  ఆదేశాలు జారీ చేసింది. పీఎంసీ బ్యాంకు సంక్షోభానికి కారకులైన రియల్‌  ఎస్టేట్‌ సంస్థ హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర‍్లకు షాకిచ్చింది.  రూ.4,355 కోట్ల విలువైన స్కాంలో బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ గురువారం ఆదేశాలు జారి చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలో జస్టిస్‌ బిఆర్ గవై, జస్టిస​ సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కమిటీ వాదనలను పరిశీలించింది. బాంబే హైకోర్టు అసాధారణంగా ఈ ఉత్తర్వులిచ్చిందనీ, హైకోర్టు వాస్తవంగా వారికి బెయిల్ మంజూరు చేసిందన్నవాదనను సుప్రీం సమర్ధించింది. 

రియల్ ఎస్టేట్ సంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్లు రాకేశ్ వాధ్వాన్‌, సారంగ్ వాధ్వాన్‌ను గృహ నిర్బంధంలో ఉంచడానికి అనుమతించిన బొంబాయి హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. వేల కోట్ల కుంభకోణంలో అరెస్టైన వారిద్దరినీ  ముంబైలోని ​ఆర్థర్ రోడ్ జైలు నుంచి మార్చడానికి వీల్లేదని ఆదేశించింది. కాగా పీఎంసీ బ్యాంకు వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్లు వాద్వాన్‌ సోదరులను జైలు నుంచి తరలించాల్సిందగా దాఖలపై పిటిషన్‌నువిచరించిన కోర్టు వారిని గృహనిర్బంధంలోకి మార్చేందుకు అంగీకరించింది. అంతేకాదు బాధితుల డిపాజిట్‌ సొమ్మును రికవరీ చేసే చర్యల్లో భాగంగా   కంపెనీ ఆస్తులనువేలానికి  త్రిసభ్య కమిటీనొకదాన్ని కూడా కోర్టు ఏర్పాటు చేసింది. ఈ ఆదేశాలను తక్షణమే  విచారించాల్సిందిగా కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది.  కాగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) కేసులో హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాకేశ్ కుమార్ వాధ్వాన్‌, ఆయన కుమారుడు, మేనేజింగ్ డైరెక్టర్ సారంగ్ వాధ్వాన్‌ను ముంబై ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) పోలీసులుగత ఏడాది అక్టోబరులో  అరెస్ట్‌ చేశారు. 


రాకేశ్ కుమార్ వాధ్వాన్‌, ఆయన కుమారుడు సారంగ్ వాధ్వాన్‌ ఫైల్‌ ఫోటో

మరిన్ని వార్తలు