పేరుపాలెం కేసులో కీలక మలుపు

6 Jul, 2019 11:53 IST|Sakshi
నిందితులను మీడియా ముందు ప్రవేశపెడుతున్న నరసాపురం డీఎస్పీ నాగేశ్వరరావు 

సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి) : మొగల్తూరు మండలం పేరుపాలెంలో సంచలనం కలిగించిన అశ్లీల వీడియో కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు పేరుపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు నిందితులు ఆగిశెట్టి గోపీనాథ్, గుత్తుల నాగసత్తిబాబును మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసులో మరో కీలక నిందితుడు కటికల బాబులు పరారీ ఉన్నాడని, అతని కోసం స్పెషల్‌టీమ్‌ను నియమించి గాలిస్తున్నామని డీఎస్పీ చెప్పారు. ఇదిలా ఉంటే కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఎ–1 నిందితుడు ఆగిశెట్టి సాయిని నెల 3న పోలీసులు అరెస్ట్‌ చేశారు. అశ్లీల వీడియోలను వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో అప్‌లోడ్‌ చేసేందుకు సాయికి వరసకు తమ్ముడైన ఆగిశెట్టి గోపీనాథ్‌ సహకరించారని, మిగతా ఇద్దరు డబ్బులు డిమాండ్‌ చేస్తూ బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడ్డారని విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. 

డీఎస్పీ కథనం ప్రకారం ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పేరుపాలెంలో సెల్‌ పాయింట్‌ నిర్వహించే ఆగిశెట్టి సాయి అమ్మాయిలను ప్రేమపేరుతో మోసం చేస్తుంటాడు. సాయి ఇదే గ్రామానికి చెందిన యువతితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా వీడియో తీసి దాచుకున్నాడు. సాయి సోదరుడు గోపీనాథ్‌ ఆ వీడియోను సాయికి తెలియకుండా దొంగిలించి దానిని తీసుకెళ్లి గుత్తుల నాగసత్తిబాబు, కటికల బాబుకు అందించాడు. ఈ ముగ్గురూ కలిసి వీడియో తిరిగి ఇవ్వాలంటే రూ. 5లక్షలు ఇవ్వాలని సాయిని డిమాండ్‌ చేశారు. అతను సకాలంలో సొమ్మలు ఇవ్వకపోవడంతో వీడియోను ముగ్గురూ కలిసి వాట్సాప్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియో వైరల్‌ కావడం గ్రామంలో సంచలనం కలిగించింది.

తరువాత బాధిత యువతి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అశ్లీల వీడియోలున్న మెమరీకార్డ్, ఈ వీడియోలను అప్‌లోడ్‌ చేయడానికి వినియోగించిన రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వివరించారు. మరో నిందితుడు కటికల సాయిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో నరసాపురం సీఐ బి.కృష్ణమోహన్, నరసాపురం, మొగల్తూరు ఎస్సైలు ఆర్‌ మల్లికార్జునరెడ్డి, షేక్‌ మదీనాబాషా పాల్గొన్నారు.

ఏం జరుగుతోంది 
ఇదిలా ఉంటే కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను ఎ1, ఎ2, ఎ3గా చూపించారు. పరారీలో ఉన్న బాబులును ఎ4గా చూపిస్తున్నారు. మొత్తం వ్యవహారంలో బ్లాక్‌ మెయిల్‌ పర్వం నుంచి వీడియోలు సర్క్యులేట్‌ చేయడం వరకూ బాబులు అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతను అనూహ్యంగా కేసులో ఎ4గా నమోదవడం, ఇంకా పట్టుపడకపోవడం వంటి అంశాలు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ అంశాలను పోలీసులు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

పని చేస్తున్నసంస్థకే కన్నం

నీళ్లనుకుని లైజాల్‌ తాగి...

సర్వే అంటూ ఇంటి తలుపుతట్టి..

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

అల్లుడిని చంపిన మామ

వజ్రాల వాటాలో గొడవ.. అందుకే చంపేశాం

నీళ్ల కోసం ఇంత దారుణమా!

డ్రైయినేజీలో ఆలయ హుండీలు!

వైద్యం అందక చిన్నారి మృతి

బాబాయిపై అబ్బాయి బండరాయితో దాడి!

సినీ నటి డాటా చోరీ

ఒకరి వెంట ఒకరు..

ఆ బస్సు ఎక్కితే అంతే సంగతులు..!

అమ్మ ఊరెళ్లిందని చెప్పడంతో..

ఆర్థిక హత్య.. ఆపై క్షుద్ర డ్రామా!

ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి

కిలాడీ ‘యాప్‌’తో జర జాగ్రత్త!

కూలి పనులకు వచ్చి కానరాని లోకాలకు..

చికెన్‌ పకోడా అడిగిందని.. చిన్నారి హత్య

హత్యాయత్నానికి దారి తీసిన విగ్రహ తయారీ

టైర్‌ పేలి లారీని ఢీకొన్న ఇన్నోవాకారు

జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..