మైనర్‌ బాలికపై అత్యాచారం; 24 గంటల్లో నిందితుడు అరెస్టు

28 Feb, 2020 20:23 IST|Sakshi

సాక్షి, కృష్ణా : నూజివీడు పట్టణంలో బుధవారం మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ రవీంద్రబాబు నిందితుడిని పట్టుకునేందుకు ఓ ఐపీఎస్‌ అధికారితోపాటు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. శుక్రవారం నిందితుడు వెంకటేశ్వర రావును అతని ఇంటి వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పట్టణంలోని గాంధీనగర్‌ నివాసి అని, హోటల్‌లో సప్లైయర్‌గా పనిచేస్తునట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును చేధించిన రూరల్‌ ఎస్‌ఐ రంజిత్‌, ఇద్దరు కానిస్టేబుళ్లకు డీఎస్పీ శ్రీనివాసులు అవార్డులు అందజేశారు. (అర్థరాత్రి బాలికపై అత్యాచారం)

మరోవైపు విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ దిశ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం నూజివీడులో అత్యాచారానికి గురైన మైనర్‌ బాలికను పరామర్శించారు. చిన్నారిపై అఘాయిత్యానికి ఒడికట్టిన వ్యక్తిని దిశ చట్టం కింద శిక్షిస్తామన్నారు. ఇలాంటి ఘటన జరగటం బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నేర నియంత్రణను ప్రతి ఒక్కరు తమ వంతు సామాజిక బాధ్యతగా తీసుకొని పోలీసులకు సహకరించాలని సూచించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని కలెక్టర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు