నకిలీల ఆటకట్టు..

19 Dec, 2019 11:13 IST|Sakshi
పోలీసులు పట్టుకున్న నకిలీ పోలీసులు (ఫైల్‌) ( ముఖాలకు రుమాళ్లు కట్టుకున్న వారు)

నిన్న నకిలీ పోలీసులు, నేడు నకిలీ మావోయిస్టులను పట్టుకున్న పోలీసులు 

వ్యాపారులే లక్ష్యంగా  అక్రమ వసూళ్లకు  పాల్పడుతున్న నకిలీలు   

ప్రత్యేక దృష్టిసారించిన   పోలీసులు

సాలూరు: పట్టణ పరిసర ప్రాంతాల్లో నకిలీ మావోయిస్టులు, నకిలీ పోలీసులు హల్‌చల్‌ చేస్తున్నారు. వర్తకులను లక్ష్యంగా   చేసుకుని వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులమని, మావోయిస్టులమని బెదిరించి వారి నుంచి డబ్బులు డిమాండ్‌  చేస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా వేల నుంచి లక్షల రుపాయల వరకు ఈ డిమాండ్లు ఉంటున్నాయి. దీంతో ఈ నకిలీలలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చాకచక్యంగా దర్యాప్తు నిర్వహిస్తూ నకిలీలను పట్టుకుంటున్నారు. కొద్ది రోజుల కిందటే నకిలీ పోలీసులను పట్టుకున్న విషయం మరువకముందే తాజాగా పాచిపెంట మండలంలో నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. 

జరిగిన సంఘటనలు.. 
ఈ ఏడాది జూన్‌ 11న పాచిపెంట మండలం పారమ్మకొండ వద్ద మక్కువ మండలంనకు చెందిన నలుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు.

ముగ్గురు నకిలీ పోలీసులు సాలూరు మండలంనకు చెందిన ఓ వర్తకుడి నుంచి 27 వేల రుపాయల నగదు కాజేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురులో ఇద్దరు నకిలీ పోలీసులను పట్టుకుని ఈ నెల 12న వారిని బొబ్బిలి కోర్టులో ప్రవేశపెట్టగా 26వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది.

పాచిపెంట మండలంలో ముగ్గురు నకిలీ మావోయిస్టులను తాజాగా పాచిపెంట పోలీసులు పట్టుకున్నారు.

ప్రత్యేక దృష్టి సారించాం.. 
నకిలీ పోలీసులు, నకిలీ మావోయిస్టుల హల్‌చల్‌ చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీంతో అటువంటి నకిలీలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల సాలూరు పట్టణంలో నకిలీ పోలీసులను పట్టుకోగా... తాజాగా పాచిపెంట మండలంలో నకిలీ మావోయిస్టులను పట్టుకున్నాం. అసాంఘిక కార్యక్రమాలకు ఎవ్వరు పాల్పడినా చర్యలు తప్పవు. 
–  సింహాద్రినాయుడు, సీఐ, సాలూరు  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్యాస్‌లీకై పేలుడు

సమత కేసు: ఆధారాలు లేవు

లిస్బన్‌ పబ్‌పై పోలీసుల దాడి.. 

ఉదయం 2 గంటలకు ఫోన్‌ చేసింది.. కానీ

ఒకరు నమ్మించి... మరొకరు బెదిరించి 

గంజాయి ముఠా.. పోలీస్‌ వేట!

చిన్నపాటి నేరాలతో పెరుగుతున్న ఈ–పెట్టి కేసులు!

రెప్పపాటులో ఘోరం 

తరగతిలో ఫ్యాన్‌కు టీచర్‌ మృతదేహం

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

పోయిన ప్రాణాన్ని దాచారు!

బ్యూటీషియన్‌పై అత్యాచారం ,హత్య

కీచకోపాధ్యాయుడు

తవ్వుతుంటే తప్పు ఒప్పుకున్నారు!

హంతకుడిని పట్టించిన గుండీ

గుంత రేణుక అరెస్ట్‌

ఇండియా గేట్‌ వద్ద యువకుడి సజీవ దహనం

దేవుడు ఖచ్చితంగా సిగ్గుపడతాడు : జడ్జి

పెళ్లికి రూ.3 కోట్లు ఖర్చు, బురిడీ బాబా అరెస్ట్‌

హాంకాంగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురు మృతి

చందానగర్‌లో వివాహిత బలవన్మరణం

మహిళ దారుణ హత్య : సైకో కిల్లర్‌ అరెస్టు

జైపూర్‌ పేలుళ్లు : నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు

ఏసీబీకి చిక్కిన అవినీతి ఖాకీ

బలవంతంగా బాలిక మెడలో తాళి

టీఆర్‌ఎస్‌ నేత హత్య: ఆ తర్వాతే అంత్యక్రియలు

బాలికపై రౌడీషీటర్‌ లైంగికదాడి

నిత్య పెళ్లికూతురు తండ్రికి రెండేళ్ల జైలు

అమ్మా.. ఎంతపని చేశావ్‌!

తృటిలో ప్రమాదం తప్పింది.. లేదంటే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డబ్బే నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది..

అలీకి మాతృ వియోగం

దక్షిణాదిలో జాన్వి ఎంట్రీ షురూ?

నటి పెళ్లి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌..

ఆటకైనా.. వేటకైనా రెడీ

వైఫ్‌ ఆఫ్‌ రామ్‌