శ్రీధరణి హత్యకేసులో నలుగురి అరెస్ట్‌

3 Mar, 2019 18:18 IST|Sakshi

సాక్షి, ఏలూరు : శ్రీధరణి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులను జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పొట్లూరి రాజు అనే నిందితుడు తుపాకుల సోమయ్య, గంగయ్య, నాగరాజులతో కలిసి ఈ నేరాన్ని చేశారని తెలిపారు. నవీన్‌పై మొదటగా కర్రతో దాడి చేశారని.. అనంతరం ధరణిపై అత్యాచారం చేసి.. ఆమెను కూడా కర్రతో కొట్టి చంపారని తెలిపారు. 

గడిచిన ఏడాదిన్నర కాలంలో ఈ గ్యాంగ్‌ వరుసగా అత్యాచారాలు చేసిందని, ఒంటరిగా తిరిగే యువతులు, జంటలే లక్ష్యంగా చేసుకునే ఈ గ్యాంగ్‌.. ఇప్పటివరకు 32 నేరాలు చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు.  ప్రతి నేరం ముందు మూడు రోజుల పాటు ఈ గ్యాంగ్‌ రెక్కీ నిర్వహించేదన్నారు. ప్రధానంగా ఆదివారం ఒంటరిగా వచ్చే ప్రేమ జంటల్నే ఈ గ్యాంగ్‌ లక్ష్యంగా చేసుకుంటూ నేరాలకు పాల్పడుతుందన్నారు. ఇప్పటివరకు ముగ్గురు యువకులు, ఓ యువతిని హత్య చేశారన్నారు. ఖమ్మం, నూజివీడు, ఇబ్రహీంపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వీరిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు.

చదవండి :

శ్రీధరణి హత్య.. నవీన్‌ పైనే అనుమానంగా ఉంది

ప్రేమికులే వాడి టార్గెట్‌

ప్రేమజంటపై దాడి: ప్రేమికుడిపై అనుమానం

శ్రీధరణి హత్యకేసులో పురోగతి ఏదీ

మరిన్ని వార్తలు