యువతితో ట్రాప్‌ చేయించి.. నగ్న వీడియోలతో

15 Nov, 2019 17:33 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాకు చెందిన వ్యక్తిని యువతితో ట్రాప్‌ చేయించి ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను సామర్లకోట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దుర్గారెడ్డి పరారీలో ఉండగా, రాకేష్‌ అనే వ్యక్తితో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. ముఠాకు చెందిన రాకేష్‌ భార్య అశ్వినీతో గొల్లలమామిడాడకు మణికంఠరెడ్డి అనే వ్యక్తిని ట్రాప్‌ చేయించారు. అతడితో పరిచయం పెంచుకునేలా పథకం రచించారు. ఈ క్రమంలో వారిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు ముఠాకు చెందిన వ్యక్తులు వీడియోలు చిత్రీకరించారు. అనంతరం ఆ నగ్న వీడియోను చూపించి మణికంఠను బెదిరించడం మొదలుపెట్టారు. అతడిని కిడ్నాప్‌ చేసి దాదాపు 63 వేల రూపాయల విలువైన ఆభరణాలు దోచుకున్నారు.

ఈ క్రమంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముఠాకు చెందిన రాకేష్‌తో పాటు వారికి సహకరించిన ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా దుర్గారెడ్డికి, రాకేష్‌కు సహకరించిన ఈ ఏడుగురు కాకినాడకు చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ముఠాలోని ప్రధాన నిందితుడైన దుర్గారెడ్డి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు