పెప్పర్‌ స్ప్రేతో చోరీ చేసే దంపతుల అరెస్ట్‌

22 Nov, 2019 11:48 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి

సాక్షి, నల్లగొండ : పెప్పర్‌ స్ప్రేతో చోరీలకు పాల్పడుతున్న దంపతులను నల్లగొండ రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారం రూ. 1.60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చోరీ సంఘటన వివరాలను నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌ రెడ్డి గురువారం నల్లగొండ రూరల్‌ పోలీస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బెంగళూరులోని తానే రోడ్డు మజీద్‌ ఈ ఖహీర్, కేజీ హల్లీం, కడుగొండనహల్లీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉండే మహ్మద్‌ ఫిరోజ్‌ అనేక చోరీలకు పాల్పడటంతో బెంగళూరులో జైలు శిక్ష అనుభవించాడు. అక్కడ జరుగుతున్న దొంగతనాలతో పోలీసులకు పట్టుబడుతున్నానని భావించి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ చాంద్రాయణగుట్ట పరిధిలో అనేక చోరీలకు పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం పీడీ యాక్ట్‌ కేసులో వరంగల్‌ జైలులో శిక్ష అనుభవించాడు. ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి లీగల్‌ ఫంక్షన్‌ హల్‌ సుభాన్‌ కాలనీలో నివాసం ఉంటూ మహ్మద్‌ సారా ఫాతీమాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది పాటు గృహిణిగా ఉన్న ఫాతిమా ఆ తరువాత భర్తతో కలిసి దొంగతనాలకు పాల్పడింది. పీడీ యాక్ట్‌ కేసులో ఫిరోజ్‌ చర్లపల్లి జైలు నుంచి 2015 ఏప్రిల్‌లో విడుదలైన తరువాత నుంచి భార్య భర్తలు ఇద్దరు కలిసి చోరీలు చేశారు. 

చోరీ చేసేది ఇలా...
తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేస్తూ భార్యాభర్తలు ఇద్దరు చోరీ చేస్తారు. ద్విచక్రం వాహనంపై చిన్న పిల్లాడితో కలిసి రెక్కీ నిర్వహిస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా కుటుంబం అనుకోవాలనే ఉద్దేశంతో రెక్కీ చేసి తాళం వేసిన ఇళ్లలోకి భర్త ఫిరోజ్‌ వెళ్లి చోరీ చేస్తాడు. భార్య ఫాతిమా చోరీ ఇంటి సమీపంలో ఇంటి వైపు ఎవరైనా వస్తున్నారా అని గమనిస్తూ భర్తకు సహకరిస్తుంది. చోరీ ఇంట్లోకి ఎవరైనా వస్తుంటే వారు ఇంట్లోకి వెళ్లకుండా మాటల్లో పెట్టి ఏదో అడ్రెస్‌ కావాలని పలాన వ్యక్తి గురించి అడుగుతూ వారి ఇళ్లు ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. ఈలోపు భర్త అంతా సర్దుకొని భార్య వద్దకు వచ్చి బైక్‌పై వెళ్లిపోతారు. చోరీకి వెళ్లినప్పుడు ఇంట్లో సభ్యులు ఎదురు తిరుగుతే వారిపై పెప్పర్‌ స్ప్రే చేసి బంగారాన్ని దోచుకుంటారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే మహిళలపై చోరీ చేసేందుకు అనుకూలంగా చూసుకొని మెడలో ఉన్న బంగారు చైన్‌ దోచుళ్తారు. డోర్‌ తాళాన్ని తొలిగించేందుకు టూల్‌ కిట్‌ను బండి వెంట పెట్టుకుంటారు. నాగర్‌కర్నూల్, జడ్చెర్ల, హైదరాబాద్‌ ప్రాంతాల్లో చోరీలు చేశారు. ఇప్పటి వరకు నల్లగొండ  పట్టణ కేంద్రంలోనే 9 దొంగతనాలు చేశారు. 

ఇలా చిక్కారు..
పట్టణ పరిధిలోని హైదరాబాద్‌ రోడ్డులో గల మర్రిగూడ ఎల్లమ్మగుడి వెనుకాల నివాసం ఉండే మంచుకొండ సుధీర్‌ కుమార్‌ ఇంట్లో ఈనెల 12న చోరీకి పాల్పడ్డారు. కుటుంబసభ్యులతో కలిసి సుధీర్‌ కుమార్‌ గుడికి వెళ్లి ఇంటికి రాగా భార్యభర్తలైన దొంగలు ఇద్దరు బీరువాను సోదిస్తున్నారు. కుటుంబసభ్యులు బిగ్గరగా కేకలు వేయడంతో దొంగలిద్దరు పారిపోయారు. వీరి ఆచూకీ కోసం ప్రత్యేక టీం ని ఏర్పాటు చేసి సమీపంలో దొరికిన సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా విచారిస్తున్నారు. గురువారం మర్రిగూడ బైపాస్‌లో వాహనాల తనిఖీ చేస్తుండగా పల్సర్‌ బైక్‌పై వెళ్తూ పోరిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద ఉన్న బంగారం, నగదు, చోరీకి సంబంధించిన పనిముట్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసులో పురోగతి సాధించిన ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డిని, ఏఎస్సై ఉపేందర్, షరీఫ్, యాదగిరి, శంకర్‌నాగరాజుç,Ü లీం, జ్యోతి, మాధవిలను డీఎస్పీ శాలువ కప్పి సన్మానించారు. ఈసమావేశంలో సీఐ బాషా, సీసీఎస్‌ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా