పడమట గ్యాంగ్‌ వార్‌ కేసులో మరో నలుగురి అరెస్టు

14 Jul, 2020 21:19 IST|Sakshi

సాక్షి, విజయవాడ: బెజవాడ పడమట గ్యాంగ్‌ వార్‌ కేసులో పోలీసులు మరో నలుగురిని మంగళవారం అరెస్టు చేశారు. వారిలో పండు గ్రూప్‌కు చెందిన రౌడీ షీటర్‌ అనంత్‌ కుమార్‌, అజయ్‌, శంకర్‌, మస్తాన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల వెల్లడించారు. అయితే ఇప్పటికే పండు గ్యాంగ్‌లోని 26 మందిని, సందీప్‌ గ్రూప్‌లోని 24 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే పండు గ్రూప్‌కు చెందిన రౌడీ షీటర్‌ అనంత్‌ కుమార్‌పై సీపీ బత్తిన శ్రీనివాసులు నగర బహిష్కరణ వేటు వేశారు. అదే గ్యాంగ్‌లోని మరో 18 మందిని సస్పెక్ట్‌ చేస్తూ.. మరో 8 మందిపై పడమటి పోలీసులు రౌడీ షీట్‌ కేసులు తెలిచారు. మరోసారి స్ట్రీట్‌ ఫైట్‌లకు దిగి బెజవాడ ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

చదవండి: విశాఖలో మరో గ్యాంగ్‌వార్‌ కలకలం

మరిన్ని వార్తలు