సూర్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు

10 Feb, 2019 13:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగునాట సంచలనం రేపిన టీవీ నటి సువ్వాడ నాగ ఝాన్సీ (21) సూసైడ్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ప్రియుడు సూర్యతేజను పంజాగుట్ట పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ప్రశ్నిస్తున్నారు. కాగా అమీర్‌పేటలోని తన నివాసంలో ఉరేసుకొని ఝాన్సీ గత మంగళవారం బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తన కూతురు ఆత్మహత్యకు సూర్యతేజనే పూర్తి కారణమని, నమ్మించి మోసం చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్‌ కోరారు. (ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడే కారణం)

పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో శనివారం వారిద్దరూ వాంగ్మూలమిచ్చారు. ఝాన్సీని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన సూర్యతేజ వైనాన్ని, అందుకు వారి వద్దనున్న ఆధారాలను పోలీసులకు అందించారు. ఝాన్సీ తల్లీ, సోదరుడు ఇచ్చిన స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకున్న పోలీసులు నాని అలియాస్‌ సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారు. ఝాన్సీ, సూర్య మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణ ఆధారంగా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య విబేధాల వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

చదవండి:
మూడు నెలలుగా ఝాన్సీకి వేధింపులు.. 
టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య

మరిన్ని వార్తలు