దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు

21 Aug, 2019 11:11 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నరేష్‌కుమార్‌

రూ.2.40లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం

సాక్షి, కురవి: బంగారు ఆభరణాలతో పాటు అపహరించిన రెండు సెల్‌ఫోన్లే ఆ దొంగలను పట్టించాయి. ఇద్దరు దొంగల అరెస్టుకు సంబంధించి మహబూబా బాద్‌ డీఎస్పీ నరేష్‌కుమార్‌ మంగళవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నా యి. మే 12న ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురానికి చెందిన దండగల కనకమ్మ కురవిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి వచ్చి ఆలయ సత్రంలో బస చేసింది. ఉక్కపోత కారణంగా గది తలుపులు తీసి పడుకోగా.. కనకమ్మతో పాటు ఆమె బంధువుల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను, రెండు సెల్‌ఫోన్లను తీసి దాచిపెట్టారు. అర్థరాత్రి ఖమ్మం జిల్లా కేం ద్రంలోని సీతారాంపురం న్యూ కాలనీకి చెందిన నల్లగొండ రాము గది త లుపులు తీసి ఉండడాన్ని గమనించి బంగారు ఆభరణాలతో పాటు రెండు సెల్‌ఫోన్లను అపహరించాడు.

తెల్లారాక గమనించిన బాధితులు కురవి పోలీ సులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కురవి ఎస్సై నాగభూషణం కేసు నమో దు చేసి రూరల్‌ సీఐ వెంకటరత్నం నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన సెల్‌ఫోన్ల కాల్‌ రికార్డును పరిశీలించగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని సీతారాంపురం న్యూ కాలనీకి చెందిన సాధం లక్ష్మినారాయణ చిరునామా లభ్యమైంది. ఆయనను విచారించగా నల్లగొండ రాము తనకు విక్రయించినట్లు తెలపడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా రాము నుంచి రూ.2.40లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. కాగా, నల్ల గొండ రాము చిన్నతనంలోనే ఒక కేసులో జైలుకు వెళ్లినట్లు తెలిపారు. సెల్‌ఫోన్‌ కాల్‌డేటా సహకారంతో నిందితులను పట్టుకున్న రూరల్‌ సీఐ వెంకటరత్నం, కురవి ఎస్సై నాగభూషణం సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

మరిన్ని వార్తలు