సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని..

14 Mar, 2018 20:13 IST|Sakshi

యువకుడిని చితకబాదిన వేములవాడ పోలీసులు

హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు

సాక్షి, సిరిసిల్ల: నేరళ్ల ఘటన మరువకముందే మరో దాష్టీకానికి పాల్పడ్డారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. తమ అక్రమాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడన్న ఆక్రోశంతో ఓ యువకున్ని దారుణంగా కొట్టారు. బాధితుడు హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సిరిసిల్లకు చెందిన సదానందం అనే యువకుడు పోలీసులు చేస్తున్న అక్రమాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ పేరుతో యువకున్ని పిలిచి తీవ్రంగా కొట్టారు. తనను వేములవాడ పోలీసులు నిర్భందించి తీవ్రంగా కొట్టారని సాక్ష్యాలతో సదానందం కోర్టును ఆశ్రయించారు. స్పందించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా పోలీసుల అరాచకాలపై ప్రజలు తీవ్రంగా మండి పడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటూనే సామాన్యులపై ​దౌర్జన్యాలకు పాల్పడటాన్ని తప్పుబడుతున్నారు. 
 

మరిన్ని వార్తలు